DevataMantra DevataMantra DevataMantra DevataMantra
How to do Nitya Puja at home।DevataMantra
పూజా సామాగ్రి
  1. పసుపు
  2. కుంకుమ
  3. తడిపిన గంధం
  4. లక్ష్మీ దేవి ప్రతిమ లేదా శ్రీ చక్ర యంత్రము
  5. పువ్వులుపుష్పములు
  6. పసుపు అక్షతలు
  7. నైవేద్యం (బెల్లం, ఏది చేసుకుంటే అది)
  8. ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  9. కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  10. పాలు
  11. పెరుగు
  12. నెయ్యి
  13. తేనే
  14. శర్కర
  15. కొబ్బరికాయ
  16. అగరవత్తులు
  17. దీపానికి నూనె
  18. వత్తివేసిన కుందులు
  19. అగ్గిపెట్టె
  20. కర్పూరం
  21. కూర్చోవడానికి ఆసనం
    భక్తులకు:
  1. మనకు వంశపారపర్యంగా వచ్చే పూజ విధానాలను నిత్యమూ అనుసరించాలి. ఆ భగవంతుడిని మనకు నిత్యానుష్టాన యోగ్యతా కలిగేలా అనుగ్రహించమని సంకల్పము చెప్పుకొని పూజ మొదలు పెట్టాలి.
  2. గురు పరంపర ఉన్నవారు గురు ముఖతః పూజ విధానాన్ని శ్రవణం చేసి నిత్యం ఆచరించాలి. గురువు లేకపోతే సర్వేశ్వరుడైన ఆ ఈశ్వరుడిని లేదా జగదాంబను గురువుగా భావించి పూజ చేయవచ్చును.
  3. పూజ చేయలేని పక్షాన కనీసము దేవతా విగ్రహాలపై లేదా ఫోటోలపై సంప్రోక్షణం (నీళ్లు చల్లి) దీపం వెలిగించి నీరును నైవేద్యముగా సమర్పించాలి. పూజా విధానములు: ఇక్కడ మీకు రెండు విధములుగా పూజలను పొందు పరచడం జరిగింది - షోడశోపచార పూజ & పంచోపచార పూజ
  4. షోడశోపచార పూజ(ధ్యానం నుండి తీర్థ ప్రసాద స్వీకరణ వరకు ఉంటుంది). ఇక్కడ మేము సంపూర్ణ షోడశోపచార పూజ సంక్షిప్త షోడశోపచార పూజ పొందు పరచడము జరిగింది.
  5. పంచోపచార పూజ (1. గంధం, 2. పుష్పం, 3. ధూపం, 4. దీపం, 5. నైవేద్యం).
  6. ఈ క్రింద పొందుపరిచినా మూడు నిత్య పూజా విధానములలో ఏది చేసిన 'శుచిః' అనే శీర్షిక నుండి 'ప్రాణ ప్రతిష్ఠాపన' అనే శీర్షిక వరకు యధా విధిగా చేయాలి.
  7. సమయముంటే సంపూర్ణ షోడశోపచార పూజ చేస్తే మహా మంచిది. అది కుదరని పక్షాన మాత్రమే సంక్షిప్త షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయవచ్చును.
  8. ఈ నిత్య పూజలో 'మమ ఇష్టదేవతాభ్యో నమః' అని ఉపచారమును సమర్పిస్తాము. అప్పుడు ఆ ఈశ్వరుడు ఆ పూజను స్వీకరించి మీ ఇష్ట దేవతా అనుగ్రహము కలిగేలా చేస్తాడు.

నిత్య పూజ

శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను. ప్రార్థన: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం । అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।। యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా । తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం ।। మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి. దీపారాధనం: ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః । సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ।। దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను. ఘంట: రక్షార్థం సర్వభూతానాం మహాలక్ష్మ్యైః ఆగమనార్థకం । ఘంటారావం కరోమ్యహం మహాదేవ్యాహ్వానలాంఛనం ।। ఘంట మ్రోగించాలి. భూతోచ్చాటనం: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే । అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ప్రాణాయామం: ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి. ఓం భూః ।ఓం భువః ।ఓం సువః ।ఓం మహః । ఓం జనః ।ఓం తపః ।ఓం సత్యం । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ । ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ । సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే (భారతవర్షే / అమెరికా ఖండే / యూరోపా ఖండే)…… దేశే…… రాష్ట్రే …… నగరే …… ప్రాంతే…… గృహే (స్వగృహే/ నివాసగృహే (అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠి సంవత్సరాణాం శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతః అహంధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్యమమ ఆత్మ శాంత్యర్థం, బుద్ధి స్థైర్య సిద్ధ్యర్థం, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, సర్వపాప క్షయార్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, లోక క్షేమార్థం, పితృ శాంత్యర్థం, మమ గృహేన అష్టైశ్వర్య స్థిరత్వ సిద్ధ్యర్థం, సర్వైశ్వర్య ప్రాప్యర్థం, నిత్యానుష్ఠాన యోగ్యతా ఫల సిధ్యర్థం, ఇష్ట దేవతా ఉద్దిశ్య ఇష్ట దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవతా నియమేన, యావచ్ఛక్తి మమ ఇష్ట దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజానం కరిష్యే ।। కలశారాధనం: తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య। కలశస్యోపరి హస్తం నిధాయ। కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః। మూలే త్వస్య స్థితో బ్రహ్మా। మధ్యే మాతృగణా స్మృతాః।। కుక్షౌ తు సాగరాసర్వే। సప్తద్వీపా వసుంధరా। ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః।। అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః। ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః । ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః । సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో । జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః । సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః। ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి. ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య।।దేవమాత్మానంచసంప్రోక్ష్య।। స్థాపన మంత్రం. త్వమేవ మాతా చ పితా త్వమేవ । త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।। త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ । త్వమేవ సర్వం మమ దేవ దేవ ।।

ప్రాణ ప్రతిష్ఠాపన

రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా మీ ఇష్టదేవతా ప్రతిమ పై నుంచుతూ ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి।। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।। నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః । నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్ ।। మమ ఇష్టదేవతా దేవతా సాంగం సాయుధం సవాహనం సశక్తి పతి పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే మమ ఇష్టదేవతా మావాహయామి। స్థాపయామి పూజయామి। సర్వదేవతాభ్యో నమః। స్థిరో భవ వరదో భవ। సుముఖో భవ సుప్రసన్నో భవ। మమాభిముఖో భవ। మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి స్థిరాసనం కురు।
నిత్య షోడశోపచార సంపూర్ణ పూజ చూడటానికి క్లిక్ చేయండి (Click to expand) ధ్యానం: ధ్యాయేత్ సర్వగతం దేవం సర్వవ్యాపినమవ్యయమ్ | సర్వలోక శరణ్యం చ సర్వభూత హితే రతమ్ || నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ।। లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం । దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ।। ధ్యానం: మీ ఇష్ట దేవతని మనసులో ధ్యానించాలి. ఆవాహనం: సర్వలోకస్య జననీం సర్వసౌఖ్య ప్రదాయినీమ్ । సర్వదేవమయీమీశాం దేవీమావాహయామ్యహమ్ ।। హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ । చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ।। మీ ఇష్ట దేవతని మనసారా ఆహ్వానించాలి. ఆసనం: తప్తకాంచన వర్ణాభం ముక్తామణి విరాజితమ్ । అమూల్యం రత్నఖచితం ఆసనం ప్రతిగృహ్యతామ్ ।। తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ । యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి ।। మీ ఇష్ట దేవతకి పుష్పాలను సమర్పించాలి. పాద్యం: గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతం నిర్మలం జలమ్ । పాద్యం గృహాణ దేవి త్వం సర్వసౌభాగ్యం దేహి మే ।। అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ । శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి ।। మీ ఇష్ట దేవత పాదాలు కడగాలి. అర్ఘ్యం: గంధపుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం దాస్యామి తే శ్రియే । గృహాణ వరదే దేవి గజేంద్రవదనప్రియే ।। కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ । పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ।। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని మీ ఇష్ట దేవతకి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. ఆచమనం: సువర్ణ పాత్ర విన్యస్తం కర్పూరాది సువాసితమ్ । ఆచమ్యతాం మహాదేవి భక్త్యా దత్తం మయా శుభే ।। చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియమ్ లోకే దేవజుష్టాముదారామ్ । తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని మీ ఇష్ట దేవతకి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. పంచామృత స్నానం: పంచామృతైః ఫలోదకైః అభిషేకం కరోమ్యహం । మమ మనః నిశ్చలం కృత్వా పరమశాంతిం ప్రయచ్ఛ మే ।। మమ ఇష్టదేవతాభ్యో నమః పంచామృతస్నానం సమర్పయామి ।। పంచామృతాలతో మీ ఇష్ట దేవతని అభిషేకించాలి. శుద్ధోదకస్నానం: ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః । తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ।। పయోదధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతమ్ । పంచామృతైః స్నపయిష్యే గృహాణ హరివల్లభే ।। మమ ఇష్టదేవతాభ్యో నమః శుద్ధోదకస్నానం సమర్పయామి ।। శుద్ధజలంతో మీ ఇష్ట దేవతని అభిషేకించాలి. వస్త్రం: దివ్యాంబరం నూతనం చ క్షౌమం తన్వం మనోహరమ్ । మయా దత్తం గృహాణ త్వం సర్వశక్తి స్వరూపిణి ।। ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ । ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ।। మమ ఇష్టదేవతాభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి । వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి । పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షతలు సమర్పించాలి. ఆభరణం: హార కుండల కేయూర మేఖలా నూపురాదిభిః । విభూషితామసి దేవి త్వం గృహాణాభరణాని మే ।। క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ । అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ।। సర్వదేవతాభ్యో నమః దివ్యాభరణాని సమర్పయామి । మీ ఇష్ట దేవతకి అక్షతలు సమర్పించాలి. గంధం: శ్రీగంధం చందనం దివ్యం కుంకుమాగరు మిశ్రితమ్ । విలేపనం గృహాణేదం భక్త్యా దత్తం మయా శివే ।। సిందూరం రక్తవర్ణం చ సిందూరతిలకప్రియే । భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్ ।। కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణమ్ । అఖండకామసౌభాగ్యం కుంకుమం ప్రతిగృహ్యతామ్ ।। సుగంధియుక్తం తైలం చ సుగంధామలకీజలమ్ । దేహసౌందర్యబీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే ।। గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ । ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః శ్రీ గంధాన్ ధారయామి సిందూరం కుంకుమం సుగంధి తైలం సమర్పయామి । మీ ఇష్ట దేవతకి గంధం, సిందూరం, కుంకుమ, సుగంధి తైలంసమర్పించాలి. అక్షతలు: శుద్ధభక్తి సంయుక్తాన్ అక్షతాన్ పరిపూరితాన్ । మమ ఇష్టదేవతా పాదయోః భక్త్యా సమర్పయామ్యహం ।। మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి । పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ।। మమ ఇష్టదేవతాభ్యో నమః అక్షతాన్ సమర్పయామి ।। మీ ఇష్ట దేవతకి అక్షతలును సమర్పించాలి. పుష్పసమర్పణం: అష్టౌ పుష్పాణి సమర్ప్య అష్టసాత్త్వికభావతః । మహాలక్ష్మీ పాదపద్మే భక్తిభావాన్ న్యస్యామ్యహం ।।
అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః ।। సర్వ భూత దయా పుష్పం । క్షమా పుష్పం విశేషతః ।। జ్ఞాన పుష్పం తప: పుష్పం । శాంతి పుష్పం తథైవ చ ।। సత్యం అష్ట విధం పుష్పో: । శ్రీ మహాలక్ష్మీ ప్రీతి కరం భవేత్ ।। కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ । శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః పుష్పాణి సమర్పయామి । పుష్పములు సమర్పించాలి. ధూపం: ధూపం నింబపత్రసంయుక్తం దుష్టపీడా నివారకం । గృహాణ దేవాదేవేశ శ్రీ మహాలక్ష్మీ నమోఽస్తుతే ।। ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే । ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ।। మమ ఇష్టదేవతాభ్యో నమః । ధూపమాఘ్రాపయామి ।। అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ మీ ఇష్ట దేవతకి చూపించాలి. దీపం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా । గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ।। ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్ । చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।। దీపానికి నమస్కారం చేయాలి నైవేద్యం: సర్వభక్ష్యైశ్చ భోజ్యైశ్చ రసైః షడ్భిః సమన్వితమ్ । నైవేద్యం మనసాదిష్టం మహాలక్ష్మి నివేదయే ।। ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ । సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।। నైవేద్యం చుట్టూ నీటిని తిప్పుతూ (పరిషేచనం) ఈ మంత్రం చదవాలి. ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ । దేవ సవితః ప్రసువః । సత్యం త్వర్తేన పరిషించామి (పగలు అయితే) । (సాయంకాలం అయితే) ‐ఋతం త్వా సత్యేన పరిషించామి (నైవేద్యంపై నీరు చల్లి) అమృతం అస్తు । అమృతోపస్తరణమసి స్వాహా। గ్రాస ముద్ర వేస్తూ మీ ఇష్టదేవతకి నైవేద్యం చూపిస్తూ ఈ మంత్రం చదవాలి. గ్రాస ముద్ర: చేతిలోని ఐదు వేళ్లను (బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరపువేలు, చిటికెనవేలు) చివరన ఒకదానికొకటి తాకించి, ఒక చిన్న ముద్దను పట్టుకున్నట్లుగా లోపలికి వంచాలి. ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా । హస్తౌ ప్రక్షాళయామి ।। పాదౌ ప్రక్షాళయామి ।। ముఖం ప్రక్షాళయామి ।। మమ ఇష్టదేవతాభ్యో నమః మహా నైవేద్యం సమర్పయామి ।। కర్పూర చందన చూర్ణేన కరోద్వర్తనం సమర్పయామి ।। నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।। ఒక పాత్రలో నీటిని వదులుతూ, అమ్మవారు చేయి, పాదములు, ముఖం, కడుక్కుంటున్నట్లు భావన చేయాలి. నైవేద్యానంతరం చేతులకు ఉన్న జిడ్డు లేదా వాసన పోవడానికి ఇస్తున్నట్లుగా అక్షతలు లేదా కొద్దిగా సుగంధ చూర్ణమును (కర్పూరం మరియు కుంకుమ కలిపిన గంధపు పొడి) సమర్పించాలి. తాంబూలం: పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతమ్ । తాంబూలం ప్రతిగృహీష్వ ముఖశుద్ధికరం శుభమ్ ।। తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ । యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః। తాంబూలం సమర్పయామి ।। మీ ఇష్ట దేవతకి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి. నీరాజనం: మంగళార్థం నీరాజనం కర్పూరవృత్తి సంయుక్తం । నమస్తే నమస్తే జగన్మాతః నమస్తే భక్తి ముక్తి ప్రదాయినీ ।। సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యా చ నో గృహే । లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మాసగ్ం సృజామసి ।। మమ ఇష్టదేవతాభ్యో నమః కర్పూరనీరాజనం సమర్పయామి ।। మీ ఇష్ట దేవతకి కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం: నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే । శ్రియై సదా నమస్తుభ్యం ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।। మహాదేవ్యైచ విద్మహే సర్వ శక్త్యైశ్చ । ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి । మీ ఇష్ట దేవతకి పుష్పాలను సమర్పించాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం: అక్షతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే । పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల । అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష మాం పరమేశ్వరీ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।। మీ ఇష్ట దేవతకి నమస్కారం చేయాలి. క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా । దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ ।। మహాలక్ష్మీమ్ ధ్యాయేన్నిత్యం భోగమోక్షఫలాప్తయే । క్షమస్వ మహాదేవీ మమాపరాధాన్ మహేశ్వరీ ।। మీ ఇష్ట దేవతకి నమస్కారం చేయాలి. సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వ । యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు తే । అనయా మయా కృత శ్రీసూక్త విధానేన శ్రీ మహాలక్ష్మీ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మకః శ్రీ మహాలక్ష్మీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ।। ఏతత్ ఫలం,శ్రీ శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు ।। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ మహాలక్ష్మీ మాతా కీ జై । అక్షతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని మీ ఇష్ట దేవత పాదాల ముందు వదలాలి. సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా । పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే ।। మీ ఇష్ట దేవతకి సాష్టాంగ నమస్కారం చేయాలి. తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ।। సమస్తపాపక్షయకరం శ్రీ ఓం మీ ఇష్ట దేవత పాదోదకం పావనం శుభమ్ ।। మమ ఇష్టదేవతాభ్యో నమః ప్రసాదం శీరసా గృహ్ణామి । ఓం శాంతిః శాంతిః శాంతిః ।। సర్వే జనాః సుఖినో భవంతు ।।
నిత్య షోడశోపచార సంక్షిప్త పూజ చూడటానికి క్లిక్ చేయండి (Click to expand) షోడశోపచార సంక్షిప్త పూజ: ధ్యాయామి మమ ఇష్టదైవం ఆవాహయామి నమోఽస్తు తే । ఆసనం పాద్యం అర్ఘ్యం చ ఆచమనీయం సమర్పయే ।। మీ ఇష్ట దేవతని మనసులో ధ్యానించాలి, ఆవాహనం చేయాలి, అక్షతలు సమర్పిస్తూ ఆసనమును ఇష్ట దైవమును తలుస్తూ దైవముకు నీరు చూపిస్తూ ఆ నీరు అర్ఘ్య పాత్రలో వదులుతూ పాదమును, అర్ఘ్యమును, ఆచమనమును సమర్పించాలి. స్నానం వస్త్రం ఆభరణం చ (యజ్ఞోపవీత) గంధ పుష్పాణి సమర్పితం । ధూపం దీపం నైవేద్యం చ తాంబూలం ఫలమేవ చ ।। పంచామృతాలతో లేదా కలశములోని శుద్ధ జలముతో అభిషేకించి వస్త్రము, ఆభరణము (స్త్రీ దేవత అయితే ) యజ్ఞోపవీతము (పురుష దేవత అయితే), గంధం, పుష్పములు సమర్పించి, ధూపం(అగర్బత్తీలు), వెలిగించిన దీపమును చూపించి, మీరు చేసిన నైవేద్యమును (నీరు సమర్పించినా నివేదనయే),తలుస్తూ నైవేద్యము, తాంబూలమును సమర్పించాలి. నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణాన్నమస్కృతం । భక్త్యా సమర్పితం తుభ్యం గృహాణ పరమేశ్వర ।। మీ ఇష్ట దేవతికి కర్పూర నీరాజనం ఇచ్చి, మంత్రపుష్పం (పుష్పమును వేసి), ప్రదక్షిణము చేసి అక్షతలను సమర్పించాలి. అల్పకాలేన మయా దేవ యథాశక్త్యా కృతం మయా । శ్రద్ధాభక్తి సమన్వితం తత్సర్వం ప్రతిగృహ్యతామ్ ।। నాకున్న సమయములో శ్రద్ధ భక్తితో నీకు పూజ చేశాను అని ఇష్టదేవతకు నమస్కారము చేయాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర । యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదచ్యుతే । మమ ఇష్టదేవతాభ్యో పూజాం సమర్పయామ్యహం ।। అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మయా । దాసోహమితి మామ్ మత్వా క్షమాస్వా పరమేశ్వర ।। పూజలో లోపాలు ఏమైనా ఉంటే క్షమించమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి తీర్థ ప్రసాదము స్వీకరించాలి.
నిత్య పంచోపచార పూజ చూడటానికి క్లిక్ చేయండి (Click to expand) పంచోపచార పూజా: తతః లామిత్యాది పంచ పూజాం కుర్యాత్ మీ ఇష్టదేవతని ఉద్దేశించి, కింది మంత్రములను పఠిస్తూ చిటికెన వేలు నుండి బొటన వేలు వరకు ఒక్కో వేలును తాకుతూ ఆయా ఉపచారాలను సమర్పించాలి.
  1. గంధం: ఓం హ్రీం శ్రీం లం పృథివీ తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో గంధం పరికల్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి గంధం సమర్పించాలి.
  2. పుష్పం: ఓం హ్రీం శ్రీం హం ఆకాశ తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో పుష్పం పరికల్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి పుష్పములు సమర్పించాలి.
  3. ధూపం: ఓం హ్రీం శ్రీం యం వాయు తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో ధూపం పరికల్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి ధూపం చూపించాలి.
  4. దీపం: ఓం హ్రీం శ్రీం రం అగ్ని తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో దీపం పరికల్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి దీపం చూపించాలి
  5. నైవేద్యం: ఓం హ్రీం శ్రీం వం అమృత తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో నైవేద్యం పరికల్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి బెల్లమును సమర్పించాలి.
  6. సర్వోపచారము: ఓం హ్రీం శ్రీం సం సర్వ తత్వాత్మకేభ్యః మమ ఇష్టదేవతాభ్యో తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి నమః । శ్రీం హ్రీం ఓం ।। మీ ఇష్టదేవతకి అక్షతలు సమర్పించాలి.
మంత్ర జపం మీ శక్త్యానుసారం మంత్ర జపమును మీ ఇష్టదేవతని తలుచుకుంటూ చేయాలి యథాశక్తి మూలమంత్రం జపేత్ । ఓం హ్రీం శ్రీం మమ ఇష్టదేవతాభ్యో శ్రీం హ్రీం ఓం ।।
ఓం శాంతిః శాంతిః శాంతిః ఇతి భక్తి-ప్రేమపూర్వక మమ ఇష్టదేవతా నిత్య పూజా సంపూర్ణః