పూర్వాంగ పూజ
ఓం శివాయ గురవే నమః
పరమగురవే నమః
సద్గురవే నమః
శ్రీ మహా గణాధిపతయే నమః
శ్రీ మహా సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ।
మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి
శుచిః:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ।।
(పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః)
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।।
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం ।
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।।
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా ।।
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ ।
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ ।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।।
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ।।
ఇప్పుడు ఎడమచేతిలో అక్షతలును తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షతలును ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి.
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ।
ఉమామహేశ్వరాభ్యాం నమః ।
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః ।
శచీపురందరాభ్యాం నమః ।
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః ।
శ్రీసీతారామాభ్యాం నమః ।
మాతాపితృభ్యో నమః ।
సర్వేభ్యో మహాజనేభ్యో నమః ।
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.
ఓం కేశవాయస్వాహా,
ఓం నారాయణాయస్వాహా,
ఓం మాధవాయస్వాహా ।
హస్తం ప్రక్షాల్యచేయి కడగండి
ఓం గోవిందాయనమః। విష్ణవేనమః । మధుసూధనాయనమః ।
త్రివిక్రమాయనమః । వామనాయనమః । శ్రీధరాయనమః। హృషీకేశాయనమః ।
పద్మనాభాయనమః । దామోదరాయనమః । సంకర్ణణాయనమ: । వాసుదేవాయనమః ।
ప్రద్యుమ్నాయ నమః । అనిరుద్దాయనమః । పురుషోత్తమాయనమః
అధోక్షజాయనమః । నారసింహాయనమః । అచ్యుతాయనమః । జనార్ధనాయనమః ।
ఉపేంద్రాయనమః । హరయే నమః । శ్రీకృష్ణాయనమః ।
దీపారాధనం:
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః ।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ।।
దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.
దేవాలయములో నవగ్రహ శాంతి పూజ చేస్తున్నట్లైతే దీపం వెలిగించే ఉంటుంది కాబట్టి ప్రత్యేకముగా వెలిగించవలసిన అవసరం లేదు. గృహములో అయితే పూజ మందిరములో దీపం వెలిగించి మండపం దగ్గర మంగళ హారతి వెలిగించాలి.
ఘంట:
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్ ।
కురుఘంటా రావం తత్ర దేవ తాహ్వాన లాంఛనమ్ ।।
ఘంటానాదం కృత్వా ।
ఘంట మ్రోగించాలి
భూతోచ్చాటనం:
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ।
అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి.
ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.
ఓం భూః ।ఓం భువః ।ఓం సువః ।ఓం మహః ।
ఓం జనః ।ఓం తపః ।ఓం సత్యం ।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ।
సంకల్పం:
ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాద్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే -- నద్యోః మధ్యదేశే శోభన గృహే/దేవాలాయే / స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే (జరుగుచున్న సంవత్సరము, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పాలి.) - సంవత్సరే అయనే -- ఋతౌ -- మాసే -- పక్ష -- తిథౌ -- వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ( గోత్రములను, పేర్లను చెప్పుకోవాలి. గ్రోతస్య నామధేయస్య - ధర్మపత్నీ సమేతస్య -- (అని పురుషులును మరియు స్త్రీలైనచో) శ్రీమతి -- గోత్రోద్భవాయాః -- నామధేయాయాః -- అని చెప్పుకోవాలి.) అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యమైశ్వర్యాది సిద్ధ్యర్థం, సమస్త మంగళావాప్యర్ధం సమస్త అభ్యుదయార్ధం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ (ధర్మపత్యాః, కుమార్త్యస్య, కుమార్యస్య అని భార్య, కొడుకైతే కొడుకు కూతురైతే కూతురు పేర్లు చెప్పుకొంటూ ) ....నక్షత్రే ... చరణే యుక్తగండే, ....(కొడుకైతే పుత్ర అని కూతురైతే పుత్రికా అని), జననేన యోదోష స్సమజని తద్దోష పరిహారార్ధం, మమ (ఇక్కడ కూతురైతే 'కుమార్త్యస్య' అని , కొడుకైతే 'కుమార్యస్య' అని పేరు చెప్పుకుంటూ..) (పెద్దకొడుకైన కూతురైన, జ్యేష్ఠ పుత్ర/జ్యేష్ఠ పుత్రిక అని, రెండవవారైతే ద్వితీయ అని మూడవవారితే తృతీయ అని, చిన్నవాళ్ళైతే కనిష్ట పుత్ర లేదా పుత్రికా అని చెపుతూ) ఆవయో శిశోశ్చ సకలగండ దుర్లోష పీడాపరిహారార్థం, మమ (పెద్దకొడుకైన కూతురైన, జ్యేష్ఠ పుత్ర/జ్యేష్ఠ పుత్రిక అని, రెండవవారైతే ద్వితీయ అని మూడవవారితే తృతీయ అని, చిన్నవాళ్ళైతే కనిష్ట పుత్ర లేదా పుత్రికా అని చెపుతూ...)
ఇంతవరకు యజమాని చెపుతారు, ఇప్పుడు గ్రహ శాంతి ఎవరి పేరు మీద చేస్తున్నారో వారు ఈ విధముగా సంకల్పం చెప్పాలి.
మమ జన్మ నక్షత్ర పూర్వక జన్మ నక్షత్రవశాత్ జన్మరాశి వశాత్, నామ నక్షత్ర పూర్వక నామ రాశి వశాత్, జన్మలగ్నవశాత్, కాలచక్రవశాత్, అంగ గ్రహశాత్, నక్షత్రగ్రహవశాత్, భూతగ్రహవశాత్, భూతా ద్యరిష్ట మహోత్పాతక, దుస్స్వప్న దుశ్శకునవశాత్ మహాదశా అంతర్దశా, అంతరాంతర్దశా, సూక్ష్మదశా, ప్రాణదశావశాత్, షడ్బల వేధ వశాత్, గోచార వేధ వశాత్, వామవేధ వశాత్, త్రివిధ శాస్త్రోక్తవేధ వశాత్, యో దోషః సమజని తద్దోష పరిహారార్ధం ఆయుష్యా భివృద్వర్ధం సర్వారిష్ట నివృత్తి ద్వారా సర్వారోగ్య సిద్ధ్యర్థం, నక్షత్రపూర్వక ఆదిత్యాది నవానాం గ్రహాణాం మధ్యే యేయే గ్రహాః అరిష్ట స్థావేషు స్థితాః తేషాం గ్రహణాం అనుకూలత్వ సిద్ధ్యర్థం, యేయే గ్రహాః శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యన్త ఆనుకూల్య శుభఫలా వాప్త్యర్థం,, అపమృత్యు పరిహారద్వారా ఆయుష్యాభివృధ్యర్థం, ఆదిత్యాది నవగ్రహదేవతా తదధిదేవతా ప్రత్యధిదేవతా ముద్దిశ్య, ఆదిత్యాది నవగ్రహదేవతా తదధిదేవతా ప్రత్యధిదేవతా ప్రీత్యర్థం, ఇంద్రాద్యష్టదిక్పాలక దేవతా ప్రీత్యర్థం, ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధ్యర్ధం నవగ్రహ మంటపారాధనాఖ్యం కర్మకరిష్యే.
(అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత ... నక్షత్ర పూర్వక ఆదిత్యాది నవగ్రహ, మృత్యుంజయ దేవతా ప్రీత్యర్థం, ... నక్షత్ర పూర్వకాదిత్యాది నవగ్రహ, మృత్యుంజయ దేవతా శాంతి మఖాఖ్యం కర్మకరిష్యే.)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే.
తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధనం:
ఒక రాగి (ఇత్తడి, స్టీల్, వెండి) చెంబులో నీరు తీసుకొని కలశ పూజ చేయాలి. ఈ నీటిని మనం పూజ అయ్యేంత వరకు పవిత్ర జలముగా వాడుకోవాలి.
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ।
కలశస్యోపరి హస్తం నిధాయ ।
కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ।
మూలే త్వస్య స్థితో బ్రహ్మా । మధ్యే మాతృగణా స్మృతాః ।।
కుక్షౌ తు సాగరాసర్వే । సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః ।।
అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః ।
ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ।
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ।
ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః ।
ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః ।
సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో ।
జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః ।
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।।
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।।
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।।
ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః ।
ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి.
ఆయాంతు శ్రీమహాగణపతి పూజార్థం దురితక్షయ కారకాః
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ।।దేవమాత్మానంచసంప్రోక్ష్య ।।
ఇక్కడ గణపతి పూజ చేయాలి. గణపతి పూజ కొరకు పుర్వాంగ పూజ ప్రక్కన ఉన్న tabని click చేసి చూడండి.
గణపతి ఆరాధన
గణపతి స్థాపన మంత్రం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।।
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం
అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి। స్థాపయామి పూజయామి।
ప్రాణప్రతిష్ఠ:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత
మనుమతే మృడయా నః స్వస్తి।।
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।।ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।।
శ్రీ మహాగణపతయే నమః।
స్థిరో భవ వరదో భవ।
సుముఖో భవ సుప్రసన్నో భవ।
మమాభిముఖో భవ।
మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి స్థిరాసనం కురు।
రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా గణపతి శిరస్సుపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. (హరిద్రా గణపతి అయితే పైదిశ లో పెట్టాలి).
ధ్యానం:
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ।
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా।।
శ్రీ మహాగణాధిపతయే నమః।
ధ్యాయామి।ధ్యానం సమర్పయామి।
గణనాథుడిని మనసులో ధ్యానించాలి.
ఆవాహనం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి।
గణనాథుడిని మనసారా ఆహ్వానించాలి.
ఆసనం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.।
పుష్పాలను సమర్పించాలి.
పాద్యం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
పాదయోః పాద్యం సమర్పయామి।
గణనాథుడి పాదాలు కడగాలి.
అర్ఘ్యం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
హస్తయోరర్ఘ్యం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
ఆచమనం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని హరిద్రా గణపతికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
శుద్ధోదకస్నానం:
సర్వనదీ శుద్ధజల సంయుతం
కలశేస్మిన్ సన్నిధౌ భవ।
స్నానం కురుష్వ గణనాథా
అగ్రపూజ్యాయా నమోఽస్తు తే ।।
శ్రీ మహాగణాధిపతయే నమః।
శుద్ధోదక స్నానం సమర్పయామి।
స్నానానంతరం ముఖేశుద్దాచమనీయం సమర్పయామి।
తమలపాకులతో జలమును చల్లాలి.
వస్త్రం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
అక్షతలును సమర్పించాలి.
యజ్ఞోపవీతం:
శ్రీ మహాగణాధిపతయే నమః।
యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।।
అక్షతలును సమర్పించాలి.
చందనం:
శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ గంధాన్ ధారయామి।
గంధం మరియు కుంకుమ పెట్టాలి.
అక్షతలు:
శ్రీ మహాగణాధిపతయే నమః। అక్షతాన్ సమర్పయామి।।
అక్షతలును సమర్పించాలి.
హరిద్రాచూర్ణం (పసుపు):
శ్రీ మహాగణాధిపతయే నమః। హరిద్రా చూర్ణం సమర్పయామి।।
పసుపును సమర్పించాలి.
కుంకుమ:
శ్రీ మహాగణాధిపతయే నమః। కుంకుమ విలేపనం సమర్పయామి।।
కుంకుమను సమర్పించాలి.
సుగంధ పరిమళ ద్రవ్యము :
శ్రీ మహాగణాధిపతయే నమః। సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।।
అక్షతలను సమర్పించాలి.
పుష్పైః పూజయామి:
ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పముులు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి.
ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః।
ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః।
ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః।
ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః।
ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః।
ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః।
ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః।
ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః।
శ్రీ మహాగణాధిపతయే నమః।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।।
ధూపం:
శ్రీ మహాగణాధిపతయే నమః।।ధూపమాఘ్రాపయామి।।
అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ చూపించాలి
దీపం:
శ్రీ మహాగణాధిపతయే నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।।
ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
దీపానికి నమస్కారం చేయాలి
నైవేద్యం:
ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।।
సత్యం త్వా ఋతేన పరిషించామి ।
సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.
అమృతమస్తు । అమృ॒తో ప॒స్తర॑ణమసి ।
శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం మహానివేదనం సమర్పయామి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా ।
ఓం వ్యా॒నాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా ।
ఓం సమానాయ స్వాహా ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అమృ॒తాపిధానమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
శ్రీ మహాగణాధిపతయే నమః। నైవేద్యం సమర్పయామి।।
పండ్లు సమర్పించాలి.
తాంబూలం:
శ్రీ మహాగణాధిపతయే నమః। తాంబూలం సమర్పయామి ।।
రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.
నీరాజనం:
శ్రీ మహాగణాధిపతయే నమః। కర్పూరనీరాజనం సమర్పయామి।।
కర్పూర హారతి ఇవ్వాలి.
మంత్రపుష్పం:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ।
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ।
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతిః ప్రచోదయాత్।।
శ్రీ మహాగణాధిపతయే నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి।
అక్షతలు, పుష్పాలను సమర్పించాలి.
ఆత్మప్రదక్షిణ నమస్కారం:
అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో
ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।।
ఉపచార పూజా:
సిద్ధి బుద్ధి సామెత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి ।
నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి ।
వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి । గజానారోహయామి ।
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి ।।
అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి.
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప।
యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే।
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా।।
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।।
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు।
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।।
ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు।
అక్షింతలు కుడిచేతిలో తీసుకొని కలశములోని నీటితో క్రింద అర్ఘ్య పాత్రలో వదలాలి.
పుష్ప ధారణ:
సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా ।
సర్వం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ ।।
పూజా సమయాన గణపతి వద్ద పుష్పముును ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు గణపతి అనుగ్రహాన్ని, ఆయురారోగ్యాలను పొందే ఒక పవిత్ర ప్రక్రియ.
ధ్యానం:
కంకణ ధారణ:
బధ్నామి కంకణం పుణ్యం
సర్వపాప వినాశనం ।
ధర్మకామార్థ సిద్ధ్యర్థం
మమ సౌభాగ్య వర్ధనం ।।
దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి.
పుణ్యాహవాచనం/స్వస్తి పుణ్యాహవాచనం
సంకల్పం:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.)
పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం, శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య మమ సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, గృహ-భూ-భాండ-ద్రవ్య-స్థల శుద్ధ్యర్థం, శరీర-మనో-బుద్ధి-చిత్త-ఆత్మ శుద్ధ్యర్థం, గృహ శుద్ధ్యర్థం , గృహోపకరణ శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే।।
పుణ్యాహం వాచయేత్ ఓమ్ భూమిం ప్రార్థ్య
ఈ మంత్రం చదువుతూ భూమిని ప్రార్థించి, పుణ్యాహవాచనాన్ని ప్రారంభించాలి.
ఓం మహి ద్యౌః పృథివీచన ఇమం యజ్ఞం మిమిక్షతామ్ ।
పిపృతాం నో భరీమభిః ।।
కలశ అభిమంత్రణం:
ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి.
ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ।
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ।
ఇతి కలశానాబి మంత్య్ర
కలశ అభిమంత్రణం:
ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి.
కలశాలలో నీరు నింపడం & నదీ ఆవాహనం:
ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలలో నీరు నింపాలి: ఆ కలశాల జలంలోకి గంగాది పుణ్య నదులను ఆహ్వానించాలి.
ఆదౌ సోదక కలశత్రయం గంధపుష్ప అక్షత
ఆమ్రపల్లవకాండాదిభిరలంకృత్య వామదక్షిణభాగేషు ఏకైక కలశం పూర్వత
ఏకకలశం సంస్థాప్య
ఆపో హిష్ఠా మయోభువ॒స్తా న॑ ఊర్జే ద॑ధాతన।
మహేరణాయ చక్షసే।
యోవః శివత॑మో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా॒ అరంగమామవో యస్య॒ క్షయాయ జిన్వథ।
ఆపో॑జ॒నయథా చ నః।।
ఇతి ఉదకమాపూర్య।
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।।
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।।
ఇతి నదీరావాహ్య।
వరుణ ఆవాహనం:
ఈ మంత్రం చదువుతూ కలశాలలో ఆయా దేవతలను ఆవాహనం వేయాలి.
ప్రాక్కలశే (తూర్పు కలశం):
ఈ మంత్రం చదువుతూ తూర్పు కలశంలో వరుణ దేవుడిని ఆవాహనం వేయాలి.
ఇమంమే వరుణశృధీ హవామధ్యాచమృడయ త్వామవస్యురాచకే ప్రాక్ కలశే
ఓం భూ: వరుణ మావాహయామి, ఓం భువ: వరుణమావాహయామి - ఓగ్ం
సువ: వరుణ మావాహయామి ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి
దక్షిణ కలశే (దక్షిణ కలశం):
ఈ మంత్రం చదువుతూ దక్షిణ కలశంలో వాస్తు పురుషుడిని ఆవాహనం వేయాలి.
వాస్తోప్పతే ప్రతిజాని హ్యస్మాన్ త్వావేశోఅనమీవో భవాన: యత్వేమహే ప్రతి తన్నో
జుషస్వ శన్న ఏదిద్విపదే శంచతుష్పదే ఇతి దక్షణ కలశే ఓం భూః: వాస్తు
పురుషమావాహయామి - ఓం భువ: వాస్తు పురుషమావాహయామి ఓగ్ం సువః
వాస్తు పురుషమావహాయామి ఓం భూర్భువస్సువః వాస్తు పురుషమావాహయామి
ఉత్తర కలశే (ఉత్తర కలశం):
ఈ మంత్రం చదువుతూ ఉత్తర కలశంలో బ్రహ్మా పురుషుడిని ఆవాహనం వేయాలి.
బ్రహ్మజజ్ఞానం ప్రధమం పురస్తాద్విసిమత స్సురుచో వేన ఆవః సబుర్నియా
ఉపమా అస్యవిష్ఠా సతశ్చయోని మసతశ్చవివ: ఇతి ఉత్తర కలశే ఓం భూః బ్రహ్మాణ
మావాహయామి ఓం భువ: బ్రహ్మాణమావాహయామి ఓం సువ
బ్రహ్మాణమావాహయామి ఓం భూర్భువస్సువః బ్రహ్మాణ మావాహయామి
ఈ మంత్రం చదువుతూ యజమాని తన శిరస్సుపై చేయినుంచాలి.
ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు । శిరస్యాభిమంత్య్ర ।
ఈ మంత్రం చదువుతూ యజమాని తన కుడిచేతిని ఎడమ చేతిపై నుంచి అరచేతులతో కలశాలను స్పృశించాలి.
శివా ఆపస్సంతు । కలశేష్వభిమంత్య్ర
ఈ మంత్రం చదువుతూ యజమాని తన హృదయాన్ని తాకాలి.
సౌమనస్యమస్తు హృదయమభీమంత్య్ర
ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు తన కుడి చేతిలోని అక్షతలను యజమాని శిరస్సుపై (తలపై) చల్లాలి.
అక్షతంచారిష్టంచాస్తు
ఇలా ఈ ప్రక్రియను మూడు మార్లు చేయాలి.
ఏవం త్రిః
ఈ మంత్రాలు చదువుతూ గంధం, పువ్వులు, అక్షతలను, రూపాయి నాణాన్ని, పోకను, యజమాని కలశాలలో వేయాలి.
గంధాః పాంతు - సుమంగళ్యాస్తూ ।
పుష్పాణి పాంతు - సౌమంగళ్యన్ చాస్తూ ।
అక్షతాః పాంతు - ఆయుష్యమస్తు ।
తాంబూలాని పాంతు - ఐశ్వర్యమస్తు ।
దక్షిణాః పాంతు - బహుదేయంచాస్తు ।
యజమాని కుడిచేత్తో కలశాలను పట్టుకుని, అక్షతలు కలశాల వద్ద వదులుతూ, అక్కడ ఉన్న బ్రాహ్మణులను "పుణ్యాహం అని పలకండి" (అనుజ్ఞ) అని కోరాలి.
స్వశ్రేయమస్తు । ప్రజాపతిః ప్రియతామ్ । శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు ।
యం కృత్వా సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మా రంభః శుభాః ప్రవర్తంతే ।
తమహమోంకారమాదిం కృత్వా పుణ్యాహం వాచయిష్యే ।।
యజమాని ఆలా పలుకగానే, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి.
ప్రధాన పురోహితుడు: ఓం పుణ్యం పుణ్యాహం వాచయిష్యే ।
బ్రాహ్మణులు: ఓం వాచ్యతామ్ ।
శ్రీ పుణ్యాహవాచన శాంతి మంత్రపాఠము:
ఈ మంత్రాలు చదువుతున్నపుడు యజమానిని శ్రద్ధగా వినమని చెప్పాలి.
ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః ।
ద్రవిణోదా ద్రవిణసశ్చుతస్య ద్రవిణోదా రాసతే మఘోనామ్ ।
ద్రవిణోదా వీరవతీమిషంనో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః ।।
సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ ।
సవితా నస్సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః ।।
ఓం నవో నవో భవతి జాయమానోఽహ్నాం కేతురుషసామేత్యగ్రే ।
భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమస్తిరతి దీర్ఘమాయుః ।।
ఈ మంత్రాలు చదువుతున్నపుడు కలశాలలోని నీటిని యజమాని దోసిలిలో పోయాలి, వారు ఆ నీటిని తలపై చల్లుకోవాలి.
ఓం ఆప ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే ।।
యస్వా హృదా కీరిణా మన్యమానో మర్త్యం మత్యోజోహవీమి ।
జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమశ్యామ్ ।।
యస్మై త్వగ్ం సుకృతే జాతవేద ఉలోకమగ్నే కృణవస్యోనమ్ ।
అశ్వినం స పుత్రిణం వీరవంతం గోమంతగ్ం రయిం నశతే స్వస్తి ।।
ఓం సం త్వా సించామి యజుషా ప్రజామాయుర్ధనం చ ।।
పై ప్రక్రియ తరువాత, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి.
ప్రధాన పురోహితుడు: మనస్సమాధీయతామ్ ।
బ్రాహ్మణులు: సమాహిత మనసస్స్మః ।
ప్రధాన పురోహితుడు: ప్రసీదంతు భవంతః ।
బ్రాహ్మణులు: ప్రసన్నాస్స్మః ।
ఓం శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు । వృద్ధిరస్తు । అవిఘ్నమస్తు ।
ఆయుష్యమస్తు । ఆరోగ్యమస్తు । స్వస్తి శివం కర్మాస్తు ।
కర్మ సమృద్ధిరస్తు । పుత్ర సమృద్ధిరస్తు । వేద సమృద్ధిరస్తు ।
శాస్త్ర సమృద్ధిరస్తు । ధనధాన్య సమృద్ధిరస్తు । ఇష్ట సంపదస్తు ।
ఈ మంత్రం చదువుతూ కలశ జలమును ఈశాన్య దిశలో చల్లవలెను
ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ।।
కలశయోర్ ఈశాన్యదేశే ఉదకంసించేత్
యత్పాపం తత్ప్రతిహతమస్తు । యచ్ఛ్రేయస్తదస్తు ।
శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమ సహితాదిత్య పురోగాః సర్వే గ్రహాః ప్రియంతామ్ ।
తిథి కరణ ముహూర్త జన్మనక్షత్ర దిగ్దేవతాః ప్రియంతామ్ ।।
నైరుత్యాం దిశి
కలశ జలమును నైరుతి దిశలో నీటిని చల్లవలెను.
ఇప్పుడు ఈ క్రింది మంత్రాలను చదువుతూ దక్షిణ, ఉత్తరకలశాలలో ఉన్న నీటిని తూర్పు కలశంలో పోసి ఆ కలశ జలాన్ని తమలపాకులతో స్పృశిస్తూ ఉండాలి.
శామ్యంతు ఘోరాణి । శామ్యంతు పాపాని । శామ్యంతు ఈతయః ।
ప్రథమ (ప్రాక్కలశే) కలశే శుభాని వర్ధంతామ్ ।
శివా ఋతవస్సంతు । శివా ఓషధయస్సంతు । శివా వనస్పతయస్సంతు ।
అహోరాత్రే శివే స్యాతామ్ ।।
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు । ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు ।
ఉత్తరోత్తరాః శుభాః క్రియాః సంపద్యంతామ్ ।
అగ్నిపురోగా విశ్వే దేవాశ్చ ప్రియంతామ్ । మాహేశ్వరీ పురోగాః మాతరః ప్రియంతామ్ ।
ఇంద్రపురోగా మరుద్గణాః ప్రియంతామ్ ।।
వశిష్ఠ పురోగా ఋషిగణాః ప్రియంతామ్ ।
శ్రీ విష్ణు పురోగాః సర్వే దేవాః ప్రియంతామ్ ।
ఆదిత్య పురోగాః సర్వే గ్రహా శ్చ ప్రియంతామ్ ।
ఋషయశ్ఛందా గ్ స్యాచార్యా వేదా యజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతామ్ ।
బ్రహ్మా చ బ్రాహ్మణాశ్చ ప్రియంతామ్ ।
బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతామ్ ।
శ్రద్ధా మేధే ప్రియేతామ్ ।
ప్రియతాం భగవాన్ నారాయణః ।
ప్రియతాం భగవాన్ స్వామీ మహాసేనః ।
ప్రియతాం భగవాన్ పితామహః ।
ప్రియతాం భగవాన్ పితామహః ।।
ఓం సత్య ఏతా ఆశిషః సంతు । పుణ్యాహకాలా వాచ్యంతామ్ ।।
నక్షత్ర శుద్ధి మంత్రము:
ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు యజమానిని మనసులో తన నక్షత్రాన్ని తలచుకోమని చెప్పాలి
ఓం పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషమ్ ।
యదా వై సూర్య ఉదేతి । అథ నక్షత్రం నైతి ।
యావతి తత్ర సూర్యో గచ్చేత్ । యత్ర జఘన్యం పశ్యేత్ ।
తావత్ కుర్వీత యత్కారీ స్యాత్ ।।
ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి । యాన్యేవ దేవ నక్షత్రాణి ।
తేషు కుర్వీత యత్కారీ స్యాత్ ।।
యజమాని మూడు సార్లు చెప్పాలి
పుణ్యాహ ఏవ కురుతే । ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు ।
ఓం పుణ్యాహమ్ । ఏవం త్రిః
ఈ మంత్రం చదువుతూ కలశాన్ని తాకుతూ ఉండి, మంత్రం ముగిశాక యజమాని అక్షతలను మూడు మార్లు కలశం వద్ద వదలాలి
ఓం స్వస్తయే వాయుముపబ్రువామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః ।
బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః ।।
ఆదిత్య ఉదయనీయః స్వస్త్యా ప్రియంతే పథ్యం స్వస్తి మభ్యుద్యన్తి స్వస్త్యై వేదప్రియంతి స్వస్త్యుద్యంతి స్వస్త్యుద్యంతి ।।
ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః ।
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు ।।
ఆక్షౌ దేవావసవ స్పోమ్యాసః చతస్రోదేవి రజరాశ్రవిష్టా ।
తే యజ్ఞం పాంతు రజసః పరస్తాత్। సంవత్సరిణ మమృతగ్ స్వస్తి ।।
మహ్యం సహ కుటుంబాయ। శుద్ధివృద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ। ఆయుష్మతే స్వస్తిం భవంతో బృవంతు ।
బ్రాహ్మణులు మూడు సార్లు చెప్పాలి
బ్రాహ్మణులు: ఆయుష్మతే స్వస్తి । ఓం స్వస్తి భవంతో బ్రువంతు - ఓం స్వస్తి - ఏవం త్రిః
ఓం బుధ్యామ స్తోమం ననుయామవాచమనో మంత్రం సరదేహోవయాతమ్ ।
యశోను వక్తవ్యం మధుగోష్వంతరాభూతాంశో అశ్వినోః కామమప్రాః ।।
సర్వామృద్ధిమృధ్నుయామితితం వై తేజసై వ పురస్తాత్పర్యభవచ్ఛం దోభిర్మధ్యతోక్షరై రుపరిష్టాద్గాయత్య్ర।
సర్వతో ద్వాదశాహం పరిభూయా త్పర్వామృద్ధిమార్నోత్సర్వా మృద్ధిమృధోతి య ఏవం వేద ।।
ద్వయ కలశ గ్రహణం:
ఈ మంత్రాలు చదువుతూ రెండు కలశాలను (దక్షిణ కలశం మరియు ఉత్తర కలశం) కుడి, ఎడమ చేతులతో పట్టుకుని బ్రాహ్మణుడు తన ముఖాన్ని కొంచెం పైకి ఎత్తి కలశాల వైపు లేదా ఆకాశం వైపు చూస్తూ యజమానిని దీవించాలి.
ఓం బుద్యాస్మ హవ్యైర్నమసో పసద్య మిత్రం దేవం మిత్రధేయంనో ఆస్తు ।
అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సవీరాః ।।
త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని । త్రీణి ఛందాంసి త్రీణి సవనాని ।
త్రయ ఇమే లోకాః । బుద్ధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతితిష్ఠతి ।।
వామదక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తరకలశా
యుగ పద్గృహీత్వా ।
ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి.
ప్రధాన పురోహితుడు: ఋద్ధ్యం భవంతో బ్రువంతు ।
బ్రాహ్మణులు: ఋధ్యతామ్ । ఋద్ధిః సమృద్ధిః ।
ఈ మంత్రాలూ చదువుతూ యజమాని తన గోత్రం పేరు వంశం పేరు చెప్పుకోమనాలి లేదా ప్రధాన పురోహితుడు చెప్పాలి.
స్వస్తి పుణ్యాహ సమృద్ధిరస్తు । వర్షశత సంపూర్ణమస్తు । ------గోత్రాభివృద్ధిరస్తు (గోత్రం పేరు చెప్పాలి) -----వంశాభివృద్ధిరస్తు(వంశం పేరు చెప్పాలి) । శాంతిః పుష్టిః తుష్టిశ్చాస్తు । శుభం శుభమస్తు ।।
పావమాన శుద్ధి (మార్జనం):
ఇత్యుదకం నిషిచ్య - నీటిని ప్రోక్షిస్తూ
ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ ముంచి యజమానిపై, పూజా ద్రవ్యాలపై మరియు ఇంటి పరిసరాలపై చల్లాలి.
యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా ।
తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ।।
ప్రాజాపత్యం పవిత్రమ్ । శతోద్యామగ్ం హిరణ్మయమ్ ।
తేన బ్రహ్మవిదో వయమ్ । పూతం బ్రహ్మ పునీమహే ।।
ఇంద్రస్సునీతీ సహ మా పునాతు। సోమస్స్వస్త్యా వరుణస్సమీచ్యా ।
యమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంతీ పునాతు ।।
ఇతి మార్జనం కృత్వా ।।
దిశ మార్జనం:
ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ అన్ని దిశల్లో ప్రోక్షించాలి (చల్లాలి).
ప్రాచ్యాం (తూర్పు) దిశి దేవా ఋత్విజో మార్జయంతాం ।
దక్షిణాయాం(దక్షిణ) దిశి మాసాః పితరో మార్జయంతాం ।
ప్రతీచ్యాం(పడమర) దిశి గృహాః పశవో మార్జయంతాం ।
ఉదీచ్యాం(ఉత్తరం) దిశి ఆప ఓషధయో వనస్పతయో మార్జయంతాం ।
ఊర్ధ్వాయాం(పైకి) దిశి యజ్ఞః సంవత్సరః యజ్ఞపతిర్మారజయం తామ్ ।।
ఏతేభ్యో బ్రాహ్మణేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః ।
శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం స్వస్తి పుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ ।।
ఈ మంత్రాలు చదువుతూ ఇంటి దైవాన్ని తలుచుకుంటూ బెల్లం నివేదన చేయాలి.
వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవానః ।
యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శన్నో భవ ద్విపదే శం చతుష్పదే ।।
వాస్తోష్పతే శగ్మయా సంసదా తే సక్షీమహి రణ్వయా గాతుమత్యా ।
ఆవహక్షేమ ఉత యోగే వరం నో యూయం పాత స్వస్తిభిస్సదా నః ।।
అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యావిశన్। సఖా సుశేవ ఏధి నః ।। శుభగ్ం శుభమ్ ।।
స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమి। మహద్భూతం వాయసం దేవతానామ్ ।
అసురఘ్నమింద్ర సఖం సమత్సు। బృహద్వ శోనామమివా రుహేమ ।।
అగ్ం హోముచ మాంగిరసం గయంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యమ్ ।
ప్రయతపాణిః శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయం నో అస్తు ।। శుభగ్ం శుభమ్
ఇతి పుణ్యాహవాచనం।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।