శ్రీ మహాగణాధిపతి సహస్రనామావళిః:
ఓం గణేశ్వరాయ నమః । ఓం గణక్రీడాయ నమః । ఓం గణనాథాయ నమః । ఓం గణాధిపాయ నమః । ఓం ఏకదంష్ట్రాయ నమః । ఓం వక్రతుండాయ నమః । ఓం గజవక్త్రాయ నమః । ఓం మహోదరాయ నమః । ఓం లంబోదరాయ నమః । ఓం ధూమ్రవర్ణాయ నమః । ఓం వికటాయ నమః । ఓం విఘ్ననాయకాయ నమః । ఓం సుముఖాయ నమః । ఓం దుర్ముఖాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం విఘ్నరాజాయ నమః । ఓం గజాననాయ నమః । ఓం భీమాయ నమః । ఓం ప్రమోదాయ నమః । ఓం ఆమోదాయ నమః । ఓం సురానందాయ నమః ।। 20 ।। ఓం మదోత్కటాయ నమః । ఓం హేరంబాయ నమః । ఓం శంబరాయ నమః । ఓం శంభవే నమః । ఓం లంబకర్ణాయ నమః । ఓం మహాబలాయ నమః । ఓం నందనాయ నమః । ఓం అలంపటాయ నమః । ఓం అభీరవే నమః । ఓం మేఘనాదాయ నమః । ఓం గణంజయాయ నమః । ఓం వినాయకాయ నమః । ఓం విరూపాక్షాయ నమః । ఓం ధీరశూరాయ నమః । ఓం వరప్రదాయ నమః । ఓం మహాగణపతయే నమః । ఓం బుద్ధిప్రియాయ నమః । ఓం క్షిప్రప్రసాదనాయ నమః । ఓం రుద్రప్రియాయ నమః ।। 40 ।। ఓం గణాధ్యక్షాయ నమః । ఓం ఉమాపుత్రాయ నమః । ఓం అఘనాశనాయ నమః । ఓం కుమారగురవే నమః । ఓం ఈశానపుత్రాయ నమః । ఓం మూషకవాహనాయ నమః । ఓం సిద్ధిప్రియాయ నమః । ఓం సిద్ధిపతయే నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సిద్ధివినాయకాయ నమః । ఓం అవిఘ్నాయ నమః । ఓం తుంబురవే నమః । ఓం సింహవాహనాయ నమః । ఓం మోహినీప్రియాయ నమః । ఓం కటంకటాయ నమః । ఓం రాజపుత్రాయ నమః । ఓం శాలకాయ నమః । ఓం సమ్మితాయ నమః । ఓం అమితాయ నమః । ఓం కూష్మాండసామసంభూతయే నమః ।। 60 ।। ఓం దుర్జయాయ నమః । ఓం ధూర్జయాయ నమః । ఓం జయాయ నమః । ఓం భూపతయే నమః । ఓం భువనపతయే నమః । ఓం భూతానాం పతయే నమః । ఓం అవ్యయాయ నమః । ఓం విశ్వకర్త్రే నమః । ఓం విశ్వముఖాయ నమః । ఓం విశ్వరూపాయ నమః । ఓం నిధయే నమః । ఓం ఘృణయే నమః । ఓం కవయే నమః । ఓం కవీనామృషభాయ నమః । ఓం బ్రహ్మణ్యాయ నమః । ఓం బ్రహ్మణస్పతయే నమః । ఓం జ్యేష్ఠరాజాయ నమః । ఓం నిధిపతయే నమః । ఓం నిధిప్రియపతిప్రియాయ నమః । ఓం హిరణ్మయపురాంతఃస్థాయ నమః ।। 80 ।। ఓం సూర్యమండలమధ్యగాయ నమః । ఓం కరాహతివిధ్వస్తసింధుసలిలాయ నమః । ఓం పూషదంతభిదే నమః । ఓం ఉమాంకకేలికుతుకినే నమః । ఓం ముక్తిదాయ నమః । ఓం కులపాలనాయ నమః । ఓం కిరీటినే నమః । ఓం కుండలినే నమః । ఓం హారిణే నమః । ఓం వనమాలినే నమః । ఓం మనోమయాయ నమః । ఓం వైముఖ్యహతదైత్యశ్రియే నమః । ఓం పాదాహతిజితక్షితయే నమః । ఓం సద్యోజాతస్వర్ణముంజమేఖలినే నమః । ఓం దుర్నిమిత్తహృతే నమః । ఓం దుఃస్వప్నహృతే నమః । ఓం ప్రసహనాయ నమః । ఓం గుణినే నమః । ఓం నాదప్రతిష్ఠితాయ నమః । ఓం సురూపాయ నమః ।। 100 ।। ఓం సర్వనేత్రాధివాసాయ నమః । ఓం వీరాసనాశ్రయాయ నమః । ఓం పీతాంబరాయ నమః । ఓం ఖండరదాయ నమః । ఓం ఖండేందుకృతశేఖరాయ నమః । ఓం చిత్రాంకశ్యామదశనాయ నమః । ఓం ఫాలచంద్రాయ నమః । ఓం చతుర్భుజాయ నమః । ఓం యోగాధిపాయ నమః । ఓం తారకస్థాయ నమః । ఓం పురుషాయ నమః । ఓం గజకర్ణకాయ నమః । ఓం గణాధిరాజాయ నమః । ఓం విజయస్థిరాయ నమః । ఓం గజపతిధ్వజినే నమః । ఓం దేవదేవాయ నమః । ఓం స్మరప్రాణదీపకాయ నమః । ఓం వాయుకీలకాయ నమః । ఓం విపశ్చిద్వరదాయ నమః । ఓం నాదోన్నాదభిన్నబలాహకాయ నమః ।। 120 ।। ఓం వరాహరదనాయ నమః । ఓం మృత్యుంజయాయ నమః । ఓం వ్యాఘ్రాజినాంబరాయ నమః । ఓం ఇచ్ఛాశక్తిధరాయ నమః । ఓం దేవత్రాత్రే నమః । ఓం దైత్యవిమర్దనాయ నమః । ఓం శంభువక్త్రోద్భవాయ నమః । ఓం శంభుకోపఘ్నే నమః । ఓం శంభుహాస్యభువే నమః । ఓం శంభుతేజసే నమః । ఓం శివాశోకహారిణే నమః । ఓం గౌరీసుఖావహాయ నమః । ఓం ఉమాంగమలజాయ నమః । ఓం గౌరీతేజోభువే నమః । ఓం స్వర్ధునీభవాయ నమః । ఓం యజ్ఞకాయాయ నమః । ఓం మహానాదాయ నమః । ఓం గిరివర్ష్మణే నమః । ఓం శుభాననాయ నమః । ఓం సర్వాత్మనే నమః ।। 140 ।। ఓం సర్వదేవాత్మనే నమః । ఓం బ్రహ్మమూర్ధ్నే నమః । ఓం కకుప్ఛ్రుతయే నమః । ఓం బ్రహ్మాండకుంభాయ నమః । ఓం చిద్వ్యోమఫాలాయ నమః । ఓం సత్యశిరోరుహాయ నమః । ఓం జగజ్జన్మలయోన్మేషనిమేషాయ నమః । ఓం అగ్న్యర్కసోమదృశే నమః । ఓం గిరీంద్రైకరదాయ నమః । ఓం ధర్మాధర్మోష్ఠాయ నమః । ఓం సామబృంహితాయ నమః । ఓం గ్రహర్క్షదశనాయ నమః । ఓం వాణీజిహ్వాయ నమః । ఓం వాసవనాసికాయ నమః । ఓం కులాచలాంసాయ నమః । ఓం సోమార్కఘంటాయ నమః । ఓం రుద్రశిరోధరాయ నమః । ఓం నదీనదభుజాయ నమః । ఓం సర్పాంగుళీకాయ నమః । ఓం తారకానఖాయ నమః ।। 160 ।। ఓం భ్రూమధ్యసంస్థితకరాయ నమః । ఓం బ్రహ్మవిద్యామదోత్కటాయ నమః । ఓం వ్యోమనాభయే నమః । ఓం శ్రీహృదయాయ నమః । ఓం మేరుపృష్ఠాయ నమః । ఓం అర్ణవోదరాయ నమః । ఓం కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషాయ నమః । ఓం పృథ్వికటయే నమః । ఓం సృష్టిలింగాయ నమః । ఓం శైలోరవే నమః । ఓం దస్రజానుకాయ నమః । ఓం పాతాళజంఘాయ నమః । ఓం మునిపదే నమః । ఓం కాలాంగుష్ఠాయ నమః । ఓం త్రయీతనవే నమః । ఓం జ్యోతిర్మండలలాంగూలాయ నమః । ఓం హృదయాలాననిశ్చలాయ నమః । ఓం హృత్పద్మకర్ణికాశాలివియత్కేలిసరోవరాయ నమః । ఓం సద్భక్తధ్యాననిగడాయ నమః । ఓం పూజావారీనివారితాయ నమః ।। 180 ।। ఓం ప్రతాపినే నమః । ఓం కశ్యపసుతాయ నమః । ఓం గణపాయ నమః । ఓం విష్టపినే నమః । ఓం బలినే నమః । ఓం యశస్వినే నమః । ఓం ధార్మికాయ నమః । ఓం స్వోజసే నమః । ఓం ప్రథమాయ నమః । ఓం ప్రథమేశ్వరాయ నమః । ఓం చింతామణిద్వీపపతయే నమః । ఓం కల్పద్రుమవనాలయాయ నమః । ఓం రత్నమండపమధ్యస్థాయ నమః । ఓం రత్నసింహాసనాశ్రయాయ నమః । ఓం తీవ్రాశిరోధృతపదాయ నమః । ఓం జ్వాలినీమౌలిలాలితాయ నమః । ఓం నందానందితపీఠశ్రియే నమః । ఓం భోగదాభూషితాసనాయ నమః । ఓం సకామదాయినీపీఠాయ నమః । ఓం స్ఫురదుగ్రాసనాశ్రయాయ నమః ।। 200 ।। ఓం తేజోవతీశిరోరత్నాయ నమః । ఓం సత్యానిత్యావతంసితాయ నమః । ఓం సవిఘ్ననాశినీపీఠాయ నమః । ఓం సర్వశక్త్యంబుజాశ్రయాయ నమః । ఓం లిపిపద్మాసనాధారాయ నమః । ఓం వహ్నిధామత్రయాశ్రయాయ నమః । ఓం ఉన్నతప్రపదాయ నమః । ఓం గూఢగుల్ఫాయ నమః । ఓం సంవృత్తపార్ష్ణికాయ నమః । ఓం పీనజంఘాయ నమః । ఓం శ్లిష్టజానవే నమః । ఓం స్థూలోరవే నమః । ఓం ప్రోన్నమత్కటయే నమః । ఓం నిమ్ననాభయే నమః । ఓం స్థూలకుక్షయే నమః । ఓం పీనవక్షసే నమః । ఓం బృహద్భుజాయ నమః । ఓం పీనస్కంధాయ నమః । ఓం కంబుకంఠాయ నమః । ఓం లంబోష్ఠాయ నమః ।। 220 ।। ఓం లంబనాసికాయ నమః । ఓం భగ్నవామరదాయ నమః । ఓం తుంగాయ సవ్యదంతాయ నమః । ఓం మహాహనవే నమః । ఓం హ్రస్వనేత్రత్రయాయ నమః । ఓం శూర్పకర్ణాయ నమః । ఓం నిబిడమస్తకాయ నమః । ఓం స్తబకాకారకుంభాగ్రాయ నమః । ఓం రత్నమౌలయే నమః । ఓం నిరంకుశాయ నమః । ఓం సర్పహారకటీసూత్రాయ నమః । ఓం సర్పయజ్ఞోపవీతయే నమః । ఓం సర్పకోటీరకటకాయ నమః । ఓం సర్పగ్రైవేయకాంగదాయ నమః । ఓం సర్పకక్ష్యోదరాబంధాయ నమః । ఓం సర్పరాజోత్తరీయకాయ నమః । ఓం రక్తాయ నమః । ఓం రక్తాంబరధరాయ నమః । ఓం రక్తమాల్యవిభూషణాయ నమః । ఓం రక్తేక్షణాయ నమః ।। 240 ।। ఓం రక్తకరాయ నమః । ఓం రక్తతాల్వోష్ఠపల్లవాయ నమః । ఓం శ్వేతాయ నమః । ఓం శ్వేతాంబరధరాయ నమః । ఓం శ్వేతమాల్యవిభూషణాయ నమః । ఓం శ్వేతాతపత్రరుచిరాయ నమః । ఓం శ్వేతచామరవీజితాయ నమః । ఓం సర్వావయవసంపూర్ణసర్వలక్షణలక్షితాయ నమః । ఓం సర్వాభరణశోభాఢ్యాయ నమః । ఓం సర్వశోభాసమన్వితాయ నమః । ఓం సర్వమంగళమాంగళ్యాయ నమః । ఓం సర్వకారణకారణాయ నమః । ఓం సర్వదైకకరాయ నమః । ఓం శార్ఙ్గిణే నమః । ఓం బీజాపూరిణే నమః । ఓం గదాధరాయ నమః । ఓం ఇక్షుచాపధరాయ నమః । ఓం శూలినే నమః । ఓం చక్రపాణయే నమః । ఓం సరోజభృతే నమః ।। 260 ।। ఓం పాశినే నమః । ఓం ధృతోత్పలాయ నమః । ఓం శాలీమంజరీభృతే నమః । ఓం స్వదంతభృతే నమః । ఓం కల్పవల్లీధరాయ నమః । ఓం విశ్వాభయదైకకరాయ నమః । ఓం వశినే నమః । ఓం అక్షమాలాధరాయ నమః । ఓం జ్ఞానముద్రావతే నమః । ఓం ముద్గరాయుధాయ నమః । ఓం పూర్ణపాత్రిణే నమః । ఓం కంబుధరాయ నమః । ఓం విధృతాలిసముద్గకాయ నమః । ఓం మాతులుంగధరాయ నమః । ఓం చూతకలికాభృతే నమః । ఓం కుఠారవతే నమః । ఓం పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకాయ నమః । ఓం భారతీసుందరీనాథాయ నమః । ఓం వినాయకరతిప్రియాయ నమః । ఓం మహాలక్ష్మీప్రియతమాయ నమః ।। 280 ।। ఓం సిద్ధలక్ష్మీమనోరమాయ నమః । ఓం రమారమేశపూర్వాంగాయ నమః । ఓం దక్షిణోమామహేశ్వరాయ నమః । ఓం మహీవరాహవామాంగాయ నమః । ఓం రతికందర్పపశ్చిమాయ నమః । ఓం ఆమోదమోదజననాయ నమః । ఓం సప్రమోదప్రమోదనాయ నమః । ఓం సమేధితసమృద్ధశ్రియే నమః । ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః । ఓం దత్తసౌముఖ్యసుముఖాయ నమః । ఓం కాంతికందళితాశ్రయాయ నమః । ఓం మదనావత్యాశ్రితాంఘ్రయే నమః । ఓం కృత్తదౌర్ముఖ్యదుర్ముఖాయ నమః । ఓం విఘ్నసంపల్లవోపఘ్నసేవాయ నమః । ఓం ఉన్నిద్రమదద్రవాయ నమః । ఓం విఘ్నకృన్నిఘ్నచరణాయ నమః । ఓం ద్రావిణీశక్తిసత్కృతాయ నమః । ఓం తీవ్రాప్రసన్ననయనాయ నమః । ఓం జ్వాలినీపాలితైకదృశే నమః । ఓం మోహినీమోహనాయ నమః ।। 300 ।। ఓం భోగదాయినీకాంతిమండితాయ నమః । ఓం కామినీకాంతవక్త్రశ్రియే నమః । ఓం అధిష్ఠితవసుంధరాయ నమః । ఓం వసుంధరామదోన్నద్ధమహాశంఖనిధిప్రభవే నమః । ఓం నమద్వసుమతీమౌలిమహాపద్మనిధిప్రభవే నమః । ఓం సర్వసద్గురుసంసేవ్యాయ నమః । ఓం శోచిష్కేశహృదాశ్రయాయ నమః । ఓం ఈశానమూర్ధ్నే నమః । ఓం దేవేంద్రశిఖాయై నమః । ఓం పవననందనాయ నమః । ఓం అగ్రప్రత్యగ్రనయనాయ నమః । ఓం దివ్యాస్త్రాణాం ప్రయోగవిదే నమః । ఓం ఐరావతాదిసర్వాశావారణావరణప్రియాయ నమః । ఓం వజ్రాద్యస్త్రపరీవారాయ నమః । ఓం గణచండసమాశ్రయాయ నమః । ఓం జయాజయపరీవారాయ నమః । ఓం విజయావిజయావహాయ నమః । ఓం అజితార్చితపాదాబ్జాయ నమః । ఓం నిత్యానిత్యావతంసితాయ నమః । ఓం విలాసినీకృతోల్లాసాయ నమః ।। 320 ।। ఓం శౌండీసౌందర్యమండితాయ నమః । ఓం అనంతానంతసుఖదాయ నమః । ఓం సుమంగళసుమంగళాయ నమః । ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తినిషేవితాయ నమః । ఓం సుభగాసంశ్రితపదాయ నమః । ఓం లలితాలలితాశ్రయాయ నమః । ఓం కామినీకామనాయ నమః । ఓం కామమాలినీకేళిలాలితాయ నమః । ఓం సరస్వత్యాశ్రయాయ నమః । ఓం గౌరీనందనాయ నమః । ఓం శ్రీనికేతనాయ నమః । ఓం గురుగుప్తపదాయ నమః । ఓం వాచాసిద్ధాయ నమః । ఓం వాగీశ్వరీపతయే నమః । ఓం నలినీకాముకాయ నమః । ఓం వామారామాయ నమః । ఓం జ్యేష్ఠామనోరమాయ నమః । ఓం రౌద్రీముద్రితపాదాబ్జాయ నమః । ఓం హుంబీజాయ నమః । ఓం తుంగశక్తికాయ నమః ।। 340 ।। ఓం విశ్వాదిజననత్రాణాయ నమః । ఓం స్వాహాశక్తయే నమః । ఓం సకీలకాయ నమః । ఓం అమృతాబ్ధికృతావాసాయ నమః । ఓం మదఘూర్ణితలోచనాయ నమః । ఓం ఉచ్ఛిష్టగణాయ నమః । ఓం ఉచ్ఛిష్టగణేశాయ నమః । ఓం గణనాయకాయ నమః । ఓం సార్వకాలికసంసిద్ధయే నమః । ఓం నిత్యశైవాయ నమః । ఓం దిగంబరాయ నమః । ఓం అనపాయాయ నమః । ఓం అనంతదృష్టయే నమః । ఓం అప్రమేయాయ నమః । ఓం అజరామరాయ నమః । ఓం అనావిలాయ నమః । ఓం అప్రతిరథాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం అమృతాయ నమః । ఓం అక్షరాయ నమః ।। 360 ।। ఓం అప్రతర్క్యాయ నమః । ఓం అక్షయాయ నమః । ఓం అజయ్యాయ నమః । ఓం అనాధారాయ నమః । ఓం అనామయాయ నమః । ఓం అమలాయ నమః । ఓం అమోఘసిద్ధయే నమః । ఓం అద్వైతాయ నమః । ఓం అఘోరాయ నమః । ఓం అప్రమితాననాయ నమః । ఓం అనాకారాయ నమః । ఓం అబ్ధిభూమ్యగ్నిబలఘ్నాయ నమః । ఓం అవ్యక్తలక్షణాయ నమః । ఓం ఆధారపీఠాయ నమః । ఓం ఆధారాయ నమః । ఓం ఆధారాధేయవర్జితాయ నమః । ఓం ఆఖుకేతనాయ నమః । ఓం ఆశాపూరకాయ నమః । ఓం ఆఖుమహారథాయ నమః । ఓం ఇక్షుసాగరమధ్యస్థాయ నమః ।। 380 ।। ఓం ఇక్షుభక్షణలాలసాయ నమః । ఓం ఇక్షుచాపాతిరేకశ్రియే నమః । ఓం ఇక్షుచాపనిషేవితాయ నమః । ఓం ఇంద్రగోపసమానశ్రియే నమః । ఓం ఇంద్రనీలసమద్యుతయే నమః । ఓం ఇందీవరదలశ్యామాయ నమః । ఓం ఇందుమండలనిర్మలాయ నమః । ఓం ఇధ్మప్రియాయ నమః । ఓం ఇడాభాగాయ నమః । ఓం ఇడాధామ్నే నమః । ఓం ఇందిరాప్రియాయ నమః । ఓం ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసినే నమః । ఓం ఇతికర్తవ్యతేప్సితాయ నమః । ఓం ఈశానమౌలయే నమః । ఓం ఈశానాయ నమః । ఓం ఈశానసుతాయ నమః । ఓం ఈతిఘ్నే నమః । ఓం ఈషణాత్రయకల్పాంతాయ నమః । ఓం ఈహామాత్రవివర్జితాయ నమః । ఓం ఉపేంద్రాయ నమః ।। 400 ।। ఓం ఉడుభృన్మౌలయే నమః । ఓం ఉండేరకబలిప్రియాయ నమః । ఓం ఉన్నతాననాయ నమః । ఓం ఉత్తుంగాయ నమః । ఓం ఉదారత్రిదశాగ్రణ్యే నమః । ఓం ఊర్జస్వతే నమః । ఓం ఊష్మలమదాయ నమః । ఓం ఊహాపోహదురాసదాయ నమః । ఓం ఋగ్యజుఃసామసంభూతయే నమః । ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః । ఓం ఋజుచిత్తైకసులభాయ నమః । ఓం ఋణత్రయవిమోచకాయ నమః । ఓం స్వభక్తానాం లుప్తవిఘ్నాయ నమః । ఓం సురద్విషాం లుప్తశక్తయే నమః । ఓం విముఖార్చానాం లుప్తశ్రియే నమః । ఓం లూతావిస్ఫోటనాశనాయ నమః । ఓం ఏకారపీఠమధ్యస్థాయ నమః । ఓం ఏకపాదకృతాసనాయ నమః । ఓం ఏజితాఖిలదైత్యశ్రియే నమః । ఓం ఏధితాఖిలసంశ్రయాయ నమః ।। 420 ।। ఓం ఐశ్వర్యనిధయే నమః । ఓం ఐశ్వర్యాయ నమః । ఓం ఐహికాముష్మికప్రదాయ నమః । ఓం ఐరమ్మదసమోన్మేషాయ నమః । ఓం ఐరావతనిభాననాయ నమః । ఓం ఓంకారవాచ్యాయ నమః । ఓం ఓంకారాయ నమః । ఓం ఓజస్వతే నమః । ఓం ఓషధీపతయే నమః । ఓం ఔదార్యనిధయే నమః । ఓం ఔద్ధత్యధుర్యాయ నమః । ఓం ఔన్నత్యనిస్వనాయ నమః । ఓం సురనాగానామంకుశాయ నమః । ఓం సురవిద్విషామంకుశాయ నమః । ఓం అఃసమస్తవిసర్గాంతపదేషుపరికీర్తితాయ నమః । ఓం కమండలుధరాయ నమః । ఓం కల్పాయ నమః । ఓం కపర్దినే నమః । ఓం కలభాననాయ నమః । ఓం కర్మసాక్షిణే నమః ।। 440 ।। ఓం కర్మకర్త్రే నమః । ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః । ఓం కదంబగోలకాకారాయ నమః । ఓం కూష్మాండగణనాయకాయ నమః । ఓం కారుణ్యదేహాయ నమః । ఓం కపిలాయ నమః । ఓం కథకాయ నమః । ఓం కటిసూత్రభృతే నమః । ఓం ఖర్వాయ నమః । ఓం ఖడ్గప్రియాయ నమః । ఓం ఖడ్గఖాతాంతఃస్థాయ నమః । ఓం ఖనిర్మలాయ నమః । ఓం ఖల్వాటశృంగనిలయాయ నమః । ఓం ఖట్వాంగినే నమః । ఓం ఖదురాసదాయ నమః । ఓం గుణాఢ్యాయ నమః । ఓం గహనాయ నమః । ఓం గస్థాయ నమః । ఓం గద్యపద్యసుధార్ణవాయ నమః । ఓం గద్యగానప్రియాయ నమః ।। 460 ।। ఓం గర్జాయ నమః । ఓం గీతగీర్వాణపూర్వజాయ నమః । ఓం గుహ్యాచారరతాయ నమః । ఓం గుహ్యాయ నమః । ఓం గుహ్యాగమనిరూపితాయ నమః । ఓం గుహాశయాయ నమః । ఓం గుహాబ్ధిస్థాయ నమః । ఓం గురుగమ్యాయ నమః । ఓం గురోర్గురవే నమః । ఓం ఘంటాఘర్ఘరికామాలినే నమః । ఓం ఘటకుంభాయ నమః । ఓం ఘటోదరాయ నమః । ఓం చండాయ నమః । ఓం చండేశ్వరసుహృదే నమః । ఓం చండీశాయ నమః । ఓం చండవిక్రమాయ నమః । ఓం చరాచరపతయే నమః । ఓం చింతామణిచర్వణలాలసాయ నమః । ఓం ఛందసే నమః । ఓం ఛందోవపుషే నమః ।। 480 ।। ఓం ఛందోదుర్లక్ష్యాయ నమః । ఓం ఛందవిగ్రహాయ నమః । ఓం జగద్యోనయే నమః । ఓం జగత్సాక్షిణే నమః । ఓం జగదీశాయ నమః । ఓం జగన్మయాయ నమః । ఓం జపాయ నమః । ఓం జపపరాయ నమః । ఓం జప్యాయ నమః । ఓం జిహ్వాసింహాసనప్రభవే నమః । ఓం ఝలజ్ఝలోల్లసద్దానఝంకారిభ్రమరాకులాయ నమః । ఓం టంకారస్ఫారసంరావాయ నమః । ఓం టంకారిమణినూపురాయ నమః । ఓం ఠద్వయీపల్లవాంతఃస్థసర్వమంత్రైకసిద్ధిదాయ నమః । ఓం డిండిముండాయ నమః । ఓం డాకినీశాయ నమః । ఓం డామరాయ నమః । ఓం డిండిమప్రియాయ నమః । ఓం ఢక్కానినాదముదితాయ నమః । ఓం ఢౌకాయ నమః ।। 500 ।। ఓం ఢుంఢివినాయకాయ నమః । ఓం తత్వానాం పరమాయ తత్త్వాయ నమః । ఓం తత్త్వంపదనిరూపితాయ నమః । ఓం తారకాంతరసంస్థానాయ నమః । ఓం తారకాయ నమః । ఓం తారకాంతకాయ నమః । ఓం స్థాణవే నమః । ఓం స్థాణుప్రియాయ నమః । ఓం స్థాత్రే నమః । ఓం స్థావరాయ జంగమాయ జగతే నమః । ఓం దక్షయజ్ఞప్రమథనాయ నమః । ఓం దాత్రే నమః । ఓం దానవమోహనాయ నమః । ఓం దయావతే నమః । ఓం దివ్యవిభవాయ నమః । ఓం దండభృతే నమః । ఓం దండనాయకాయ నమః । ఓం దంతప్రభిన్నాభ్రమాలాయ నమః । ఓం దైత్యవారణదారణాయ నమః । ఓం దంష్ట్రాలగ్నద్విపఘటాయ నమః ।। 520 ।। ఓం దేవార్థనృగజాకృతయే నమః । ఓం ధనధాన్యపతయే నమః । ఓం ధన్యాయ నమః । ఓం ధనదాయ నమః । ఓం ధరణీధరాయ నమః । ఓం ధ్యానైకప్రకటాయ నమః । ఓం ధ్యేయాయ నమః । ఓం ధ్యానాయ నమః । ఓం ధ్యానపరాయణాయ నమః । ఓం నంద్యాయ నమః । ఓం నందిప్రియాయ నమః । ఓం నాదాయ నమః । ఓం నాదమధ్యప్రతిష్ఠితాయ నమః । ఓం నిష్కళాయ నమః । ఓం నిర్మలాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం నిత్యానిత్యాయ నమః । ఓం నిరామయాయ నమః । ఓం పరస్మై వ్యోమ్నే నమః । ఓం పరస్మై ధామ్మే నమః ।। 540 ।। ఓం పరమాత్మనే నమః । ఓం పరస్మై పదాయ నమః । ఓం పరాత్పరాయ నమః । ఓం పశుపతయే నమః । ఓం పశుపాశవిమోచకాయ నమః । ఓం పూర్ణానందాయ నమః । ఓం పరానందాయ నమః । ఓం పురాణపురుషోత్తమాయ నమః । ఓం పద్మప్రసన్ననయనాయ నమః । ఓం ప్రణతాజ్ఞానమోచనాయ నమః । ఓం ప్రమాణప్రత్యాయాతీతాయ నమః । ఓం ప్రణతార్తినివారణాయ నమః । ఓం ఫలహస్తాయ నమః । ఓం ఫణిపతయే నమః । ఓం ఫేత్కారాయ నమః । ఓం ఫాణితప్రియాయ నమః । ఓం బాణార్చితాంఘ్రియుగళాయ నమః । ఓం బాలకేళికుతూహలినే నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం బ్రహ్మార్చితపదాయ నమః ।। 560 ।। ఓం బ్రహ్మచారిణే నమః । ఓం బృహస్పతయే నమః । ఓం బృహత్తమాయ నమః । ఓం బ్రహ్మపరాయ నమః । ఓం బ్రహ్మణ్యాయ నమః । ఓం బ్రహ్మవిత్ప్రియాయ నమః । ఓం బృహన్నాదాగ్ర్యచీత్కారాయ నమః । ఓం బ్రహ్మాండావలిమేఖలాయ నమః । ఓం భ్రూక్షేపదత్తలక్ష్మీకాయ నమః । ఓం భర్గాయ నమః । ఓం భద్రాయ నమః । ఓం భయాపహాయ నమః । ఓం భగవతే నమః । ఓం భక్తిసులభాయ నమః । ఓం భూతిదాయ నమః । ఓం భూతిభూషణాయ నమః । ఓం భవ్యాయ నమః । ఓం భూతాలయాయ నమః । ఓం భోగదాత్రే నమః । ఓం భ్రూమధ్యగోచరాయ నమః ।। 580 ।। ఓం మంత్రాయ నమః । ఓం మంత్రపతయే నమః । ఓం మంత్రిణే నమః । ఓం మదమత్తమనోరమాయ నమః । ఓం మేఖలావతే నమః । ఓం మందగతయే నమః । ఓం మతిమత్కమలేక్షణాయ నమః । ఓం మహాబలాయ నమః । ఓం మహావీర్యాయ నమః । ఓం మహాప్రాణాయ నమః । ఓం మహామనసే నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం యజ్ఞపతయే నమః । ఓం యజ్ఞగోప్త్రే నమః । ఓం యజ్ఞఫలప్రదాయ నమః । ఓం యశస్కరాయ నమః । ఓం యోగగమ్యాయ నమః । ఓం యాజ్ఞికాయ నమః । ఓం యాజకప్రియాయ నమః । ఓం రసాయ నమః ।। 600 ।। ఓం రసప్రియాయ నమః । ఓం రస్యాయ నమః । ఓం రంజకాయ నమః । ఓం రావణార్చితాయ నమః । ఓం రక్షోరక్షాకరాయ నమః । ఓం రత్నగర్భాయ నమః । ఓం రాజ్యసుఖప్రదాయ నమః । ఓం లక్ష్యాలక్ష్యప్రదాయ నమః । ఓం లక్ష్యాయ నమః । ఓం లయస్థాయ నమః । ఓం లడ్డుకప్రియాయ నమః । ఓం లానప్రియాయ నమః । ఓం లాస్యపరాయ నమః । ఓం లాభకృతే నమః । ఓం లోకవిశ్రుతాయ నమః । ఓం వరేణ్యాయ నమః । ఓం వహ్నివదనాయ నమః । ఓం వంద్యాయ నమః । ఓం వేదాంతగోచరాయ నమః । ఓం వికర్త్రే నమః ।। 620 ।। ఓం విశ్వతశ్చక్షుషే నమః । ఓం విధాత్రే నమః । ఓం విశ్వతోముఖాయ నమః । ఓం వామదేవాయ నమః । ఓం విశ్వనేత్రే నమః । ఓం వజ్రివజ్రనివారణాయ నమః । ఓం విశ్వబంధనవిష్కంభాధారాయ నమః । ఓం విశ్వేశ్వరప్రభవే నమః । ఓం శబ్దబ్రహ్మణే నమః । ఓం శమప్రాప్యాయ నమః । ఓం శంభుశక్తిగణేశ్వరాయ నమః । ఓం శాస్త్రే నమః । ఓం శిఖాగ్రనిలయాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం శిఖరీశ్వరాయ నమః । ఓం షడృతుకుసుమస్రగ్విణే నమః । ఓం షడాధారాయ నమః । ఓం షడక్షరాయ నమః । ఓం సంసారవైద్యాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః ।। 640 ।। ఓం సర్వభేషజభేషజాయ నమః । ఓం సృష్టిస్థితిలయక్రీడాయ నమః । ఓం సురకుంజరభేదనాయ నమః । ఓం సిందూరితమహాకుంభాయ నమః । ఓం సదసద్వ్యక్తిదాయకాయ నమః । ఓం సాక్షిణే నమః । ఓం సముద్రమథనాయ నమః । ఓం స్వసంవేద్యాయ నమః । ఓం స్వదక్షిణాయ నమః । ఓం స్వతంత్రాయ నమః । ఓం సత్యసంకల్పాయ నమః । ఓం సామగానరతాయ నమః । ఓం సుఖినే నమః । ఓం హంసాయ నమః । ఓం హస్తిపిశాచీశాయ నమః । ఓం హవనాయ నమః । ఓం హవ్యకవ్యభుజే నమః । ఓం హవ్యాయ నమః । ఓం హుతప్రియాయ నమః । ఓం హర్షాయ నమః ।। 660 ।। ఓం హృల్లేఖామంత్రమధ్యగాయ నమః । ఓం క్షేత్రాధిపాయ నమః । ఓం క్షమాభర్త్రే నమః । ఓం క్షమాపరపరాయణాయ నమః । ఓం క్షిప్రక్షేమకరాయ నమః । ఓం క్షేమానందాయ నమః । ఓం క్షోణీసురద్రుమాయ నమః । ఓం ధర్మప్రదాయ నమః । ఓం అర్థదాయ నమః । ఓం కామదాత్రే నమః । ఓం సౌభాగ్యవర్ధనాయ నమః । ఓం విద్యాప్రదాయ నమః । ఓం విభవదాయ నమః । ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః । ఓం ఆభిరూప్యకరాయ నమః । ఓం వీరశ్రీప్రదాయ నమః । ఓం విజయప్రదాయ నమః । ఓం సర్వవశ్యకరాయ నమః । ఓం గర్భదోషఘ్నే నమః । ఓం పుత్రపౌత్రదాయ నమః ।। 680 ।। ఓం మేధాదాయ నమః । ఓం కీర్తిదాయ నమః । ఓం శోకహారిణే నమః । ఓం దౌర్భాగ్యనాశనాయ నమః । ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః । ఓం రుష్టచిత్తప్రసాదనాయ నమః । ఓం పరాభిచారశమనాయ నమః । ఓం దుఃఖభంజనకారకాయ నమః । ఓం లవాయ నమః । ఓం త్రుటయే నమః । ఓం కలాయై నమః । ఓం కాష్ఠాయై నమః । ఓం నిమేషాయ నమః । ఓం తత్పరాయ నమః । ఓం క్షణాయ నమః । ఓం ఘట్యై నమః । ఓం ముహూర్తాయ నమః । ఓం ప్రహరాయ నమః । ఓం దివానక్తాయ నమః । ఓం అహర్నిశాయ నమః ।। 700 ।। ఓం పక్షాయ నమః । ఓం మాసాయ నమః । ఓం అయనాయ నమః । ఓం వర్షాయ నమః । ఓం యుగాయ నమః । ఓం కల్పాయ నమః । ఓం మహాలయాయ నమః । ఓం రాశయే నమః । ఓం తారాయై నమః । ఓం తిథయే నమః । ఓం యోగాయ నమః । ఓం వారాయ నమః । ఓం కరణాయ నమః । ఓం అంశకాయ నమః । ఓం లగ్నాయ నమః । ఓం హోరాయై నమః । ఓం కాలచక్రాయ నమః । ఓం మేరవే నమః । ఓం సప్తర్షిభ్యో నమః । ఓం ధ్రువాయ నమః ।। 720 ।। ఓం రాహవే నమః । ఓం మందాయ నమః । ఓం కవయే నమః । ఓం జీవాయ నమః । ఓం బుధాయ నమః । ఓం భౌమాయ నమః । ఓం శశినే నమః । ఓం రవయే నమః । ఓం కాలాయ నమః । ఓం సృష్టయే నమః । ఓం స్థితయే నమః । ఓం విశ్వస్మై స్థావరాయ జంగమాయ నమః । ఓం యస్మై నమః । ఓం భువే నమః । ఓం అద్భ్యో నమః । ఓం అగ్నయే నమః । ఓం మరుతే నమః । ఓం వ్యోమ్నే నమః । ఓం అహంకృతయే నమః । ఓం ప్రకృతయే నమః ।। 740 ।। ఓం పుంసే నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం విష్ణవే నమః । ఓం శివాయ నమః । ఓం రుద్రాయ నమః । ఓం ఈశాయ నమః । ఓం శక్తయే నమః । ఓం సదాశివాయ నమః । ఓం త్రిదశేభ్యో నమః । ఓం పితృభ్యో నమః । ఓం సిద్ధేభ్యో నమః । ఓం యక్షేభ్యో నమః । ఓం రక్షోభ్యో నమః । ఓం కిన్నరేభ్యో నమః । ఓం సాధ్యేభ్యో నమః । ఓం విద్యాధరేభ్యో నమః । ఓం భూతేభ్యో నమః । ఓం మనుష్యేభ్యో నమః । ఓం పశుభ్యో నమః । ఓం ఖగేభ్యో నమః ।। 760 ।। ఓం సముద్రేభ్యో నమః । ఓం సరిద్భ్యో నమః । ఓం శైలేభ్యో నమః । ఓం భూతాయ నమః । ఓం భవ్యాయ నమః । ఓం భవోద్భవాయ నమః । ఓం సాంఖ్యాయ నమః । ఓం పాతంజలాయ నమః । ఓం యోగాయ నమః । ఓం పురాణేభ్యో నమః । ఓం శ్రుత్యై నమః । ఓం స్మృత్యై నమః । ఓం వేదాంగేభ్యో నమః । ఓం సదాచారాయ నమః । ఓం మీమాంసాయై నమః । ఓం న్యాయవిస్తరాయ నమః । ఓం ఆయుర్వేదాయ నమః । ఓం ధనుర్వేదీయ నమః । ఓం గాంధర్వాయ నమః । ఓం కావ్యనాటకాయ నమః ।। 780 ।। ఓం వైఖానసాయ నమః । ఓం భాగవతాయ నమః । ఓం సాత్వతాయ నమః । ఓం పాంచరాత్రకాయ నమః । ఓం శైవాయ నమః । ఓం పాశుపతాయ నమః । ఓం కాలాముఖాయ నమః । ఓం భైరవశాసనాయ నమః । ఓం శాక్తాయ నమః । ఓం వైనాయకాయ నమః । ఓం సౌరాయ నమః । ఓం జైనాయ నమః । ఓం ఆర్హతసంహితాయై నమః । ఓం సతే నమః । ఓం అసతే నమః । ఓం వ్యక్తాయ నమః । ఓం అవ్యక్తాయ నమః । ఓం సచేతనాయ నమః । ఓం అచేతనాయ నమః । ఓం బంధాయ నమః ।। 800 ।। ఓం మోక్షాయ నమః । ఓం సుఖాయ నమః । ఓం భోగాయ నమః । ఓం అయోగాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం అణవే నమః । ఓం మహతే నమః । ఓం స్వస్తయే నమః । ఓం హుం నమః । ఓం ఫట్ నమః । ఓం స్వధా నమః । ఓం స్వాహా నమః । ఓం శ్రౌషట్ నమః । ఓం వౌషట్ నమః । ఓం వషట్ నమః । ఓం జ్ఞానాయ నమః । ఓం విజ్ఞానాయ నమః । ఓం ఆనందాయ నమః । ఓం బోధాయ నమః । ఓం సంవిదే నమః ।। 820 ।। ఓం శమాయ నమః । ఓం యమాయ నమః । ఓం ఏకస్మై నమః । ఓం ఏకాక్షరాధారాయ నమః । ఓం ఏకాక్షరపరాయణాయ నమః । ఓం ఏకాగ్రధియే నమః । ఓం ఏకవీరాయ నమః । ఓం ఏకానేకస్వరూపధృతే నమః । ఓం ద్విరూపాయ నమః । ఓం ద్విభుజాయ నమః । ఓం ద్వ్యక్షాయ నమః । ఓం ద్విరదాయ నమః । ఓం ద్వీపరక్షకాయ నమః । ఓం ద్వైమాతురాయ నమః । ఓం ద్వివదనాయ నమః । ఓం ద్వంద్వాతీతాయ నమః । ఓం ద్వయాతిగాయ నమః । ఓం త్రిధామ్నే నమః । ఓం త్రికరాయ నమః । ఓం త్రేతాయై నమః ।। 840 ।। ఓం త్రివర్గఫలదాయకాయ నమః । ఓం త్రిగుణాత్మనే నమః । ఓం త్రిలోకాదయే నమః । ఓం త్రిశక్తీశాయ నమః । ఓం త్రిలోచనాయ నమః । ఓం చతుర్బాహవే నమః । ఓం చతుర్దంతాయ నమః । ఓం చతురాత్మనే నమః । ఓం చతుర్ముఖాయ నమః । ఓం చతుర్విధోపాయమయాయ నమః । ఓం చతుర్వర్ణాశ్రమాశ్రయాయ నమః । ఓం చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకాయ నమః । ఓం చతుర్థీపూజనప్రీతాయ నమః । ఓం చతుర్థీతిథిసంభవాయ నమః । ఓం పంచాక్షరాత్మనే నమః । ఓం పంచాత్మనే నమః । ఓం పంచాస్యాయ నమః । ఓం పంచకృత్యకృతే నమః । ఓం పంచాధారాయ నమః । ఓం పంచవర్ణాయ నమః ।। 860 ।। ఓం పంచాక్షరపరాయణాయ నమః । ఓం పంచతాలాయ నమః । ఓం పంచకరాయ నమః । ఓం పంచప్రణవభావితాయ నమః । ఓం పంచబ్రహ్మమయస్ఫూర్తయే నమః । ఓం పంచావరణవారితాయ నమః । ఓం పంచభక్ష్యప్రియాయ నమః । ఓం పంచబాణాయ నమః । ఓం పంచశివాత్మకాయ నమః । ఓం షట్కోణపీఠాయ నమః । ఓం షట్చక్రధామ్నే నమః । ఓం షడ్గ్రంథిభేదకాయ నమః । ఓం షడధ్వధ్వాంతవిధ్వంసినే నమః । ఓం షడంగులమహాహ్రదాయ నమః । ఓం షణ్ముఖాయ నమః । ఓం షణ్ముఖభ్రాత్రే నమః । ఓం షట్ఛక్తిపరివారితాయ నమః । ఓం షడ్వైరివర్గవిధ్వంసినే నమః । ఓం షడూర్మిభయభంజనాయ నమః । ఓం షట్తర్కదూరాయ నమః ।। 880 ।। ఓం షట్కర్మనిరతాయ నమః । ఓం షడ్రసాశ్రయాయ నమః । ఓం సప్తపాతాలచరణాయ నమః । ఓం సప్తద్వీపోరుమండలాయ నమః । ఓం సప్తస్వర్లోకముకుటాయ నమః । ఓం సప్తసప్తివరప్రదాయ నమః । ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః । ఓం సప్తర్షిగణమండితాయ నమః । ఓం సప్తచ్ఛందోనిధయే నమః । ఓం సప్తహోత్రే నమః । ఓం సప్తస్వరాశ్రయాయ నమః । ఓం సప్తాబ్ధికేలికాసారాయ నమః । ఓం సప్తమాతృనిషేవితాయ నమః । ఓం సప్తచ్ఛందోమోదమదాయ నమః । ఓం సప్తచ్ఛందోమఖప్రభవే నమః । ఓం అష్టమూర్తిధ్యేయమూర్తయే నమః । ఓం అష్టప్రకృతికారణాయ నమః । ఓం అష్టాంగయోగఫలభుజే నమః । ఓం అష్టపత్రాంబుజాసనాయ నమః । ఓం అష్టశక్తిసమృద్ధశ్రియే నమః ।। 900 ।। ఓం అష్టైశ్వర్యప్రదాయకాయ నమః । ఓం అష్టపీఠోపపీఠశ్రియే నమః । ఓం అష్టమాతృసమావృతాయ నమః । ఓం అష్టభైరవసేవ్యాయ నమః । ఓం అష్టవసువంద్యాయ నమః । ఓం అష్టమూర్తిభృతే నమః । ఓం అష్టచక్రస్ఫూరన్మూర్తయే నమః । ఓం అష్టద్రవ్యహవిఃప్రియాయ నమః । ఓం నవనాగాసనాధ్యాసినే నమః । ఓం నవనిధ్యనుశాసితాయ నమః । ఓం నవద్వారపురాధారాయ నమః । ఓం నవాధారనికేతనాయ నమః । ఓం నవనారాయణస్తుత్యాయ నమః । ఓం నవదుర్గానిషేవితాయ నమః । ఓం నవనాథమహానాథాయ నమః । ఓం నవనాగవిభూషణాయ నమః । ఓం నవరత్నవిచిత్రాంగాయ నమః । ఓం నవశక్తిశిరోధృతాయ నమః । ఓం దశాత్మకాయ నమః । ఓం దశభుజాయ నమః ।। 920 ।। ఓం దశదిక్పతివందితాయ నమః । ఓం దశాధ్యాయాయ నమః । ఓం దశప్రాణాయ నమః । ఓం దశేంద్రియనియామకాయ నమః । ఓం దశాక్షరమహామంత్రాయ నమః । ఓం దశాశావ్యాపివిగ్రహాయ నమః । ఓం ఏకాదశాదిభీరుద్రైఃస్తుతాయ నమః । ఓం ఏకాదశాక్షరాయ నమః । ఓం ద్వాదశోద్దండదోర్దండాయ నమః । ఓం ద్వాదశాంతనికేతనాయ నమః । ఓం త్రయోదశాభిదాభిన్నవిశ్వేదేవాధిదైవతాయ నమః । ఓం చతుర్దశేంద్రవరదాయ నమః । ఓం చతుర్దశమనుప్రభవే నమః । ఓం చతుర్దశాదివిద్యాఢ్యాయ నమః । ఓం చతుర్దశజగత్ప్రభవే నమః । ఓం సామపంచదశాయ నమః । ఓం పంచదశీశీతాంశునిర్మలాయ నమః । ఓం షోడశాధారనిలయాయ నమః । ఓం షోడశస్వరమాతృకాయ నమః । ఓం షోడశాంతపదావాసాయ నమః ।940 ।। ఓం షోడశేందుకళాత్మకాయ నమః । ఓం కళాసప్తదశ్యై నమః । ఓం సప్తదశాయ నమః । ఓం సప్తదశాక్షరాయ నమః । ఓం అష్టాదశద్వీపపతయే నమః । ఓం అష్టాదశపురాణకృతే నమః । ఓం అష్టాదశౌషధీసృష్టయే నమః । ఓం అష్టాదశవిధిస్మృతాయ నమః । ఓం అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదాయ నమః । ఓం ఏకవింశాయ పుంసే నమః । ఓం ఏకవింశత్యంగుళిపల్లవాయ నమః । ఓం చతుర్వింశతితత్త్వాత్మనే నమః । ఓం పంచవింశాఖ్యపూరుషాయ నమః । ఓం సప్తవింశతితారేశాయ నమః । ఓం సప్తవింశతియోగకృతే నమః । ఓం ద్వాత్రింశద్భైరవాధీశాయ నమః । ఓం చతుస్త్రింశన్మహాహ్రదాయ నమః । ఓం షట్త్రింశత్తత్త్వసంభూతయే నమః । ఓం అష్టత్రింశత్కళాతనవే నమః । ఓం నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గళాయ నమః ।। 960 ।। ఓం పంచాశదక్షరశ్రేణ్యే నమః । ఓం పంచాశద్రుద్రవిగ్రహాయ నమః । ఓం పంచాశద్విష్ణుశక్తీశాయ నమః । ఓం పంచాశన్మాతృకాలయాయ నమః । ఓం ద్విపంచాశద్వపుఃశ్రేణ్యే నమః । ఓం త్రిషష్ట్యక్షరసంశ్రయాయ నమః । ఓం చతుఃషష్ట్యర్ణనిర్ణేత్రే నమః । ఓం చతుఃషష్టికళానిధయే నమః । ఓం చతుఃషష్టిమహాసిద్ధయోగినీబృందవందితాయ నమః । ఓం అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనాయ నమః । ఓం చతుర్నవతిమంత్రాత్మనే నమః । ఓం షణ్ణవత్యధికప్రభవే నమః । ఓం శతానందాయ నమః । ఓం శతధృతయే నమః । ఓం శతపత్రాయతేక్షణాయ నమః । ఓం శతానీకాయ నమః । ఓం శతమఖాయ నమః । ఓం శతధారావరాయుధాయ నమః । ఓం సహస్రపత్రనిలయాయ నమః । ఓం సహస్రఫణభూషణాయ నమః ।। 980 ।। ఓం సహస్రశీర్షాపురుషాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రపదే నమః । ఓం సహస్రనామసంస్తుత్యాయ నమః । ఓం సహస్రాక్షబలాపహాయ నమః । ఓం దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనాయ నమః । ఓం అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితాయ నమః । ఓం లక్షాధీశప్రియాధారాయ నమః । ఓం లక్షాధారమనోమయాయ నమః । ఓం చతుర్లక్షజపప్రీతాయ నమః । ఓం చతుర్లక్షప్రకాశితాయ నమః । ఓం చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితాయ నమః । ఓం కోటిసూర్యప్రతీకాశాయ నమః । ఓం కోటిచంద్రాంశునిర్మలాయ నమః । ఓం శివాభవాధ్యుష్టకోటివినాయకధురంధరాయ నమః । ఓం సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతయే నమః । ఓం త్రయస్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకాయ నమః । ఓం అనంతనామ్నే నమః । ఓం అనంతశ్రియే నమః । ఓం అనంతానంతసౌఖ్యదాయ నమః ।। 1000 ।। ఇతి శ్రీ మహాగణాధిపతి సహస్రనామావళిః।